అషుతో యాంకర్ శివ మళ్లీ డర్టీ టాక్.. తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్న నెటిజన్లు!

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.ఫినాలే ఎపిసోడ్ కి దగ్గర పడుతున్న కొద్ది కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ నడుస్తోంది.

 Bigg Boss Non Stop May 1st Episode Details Ashu Reddy Anchor Shiva Uncomfortable-TeluguStop.com

ఇకపోతే హౌస్ లో యాంకర్ శివ ఇప్పటికే పలు సార్లు నోటిదురుసు తో వివాదాలు సృష్టించిన విషయం తెలిసిందే.తరచూ యాంకర్ శివ తన నోటి దురుసు ప్రవర్తన వల్ల వివాదానికి దారి తీస్తూనే ఉంటాయి.

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ సరయుతో మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మరొకసారి యాంకర్ శివ అషు రెడ్డితో చేసిన పరాచికాలు మరొకసారి వివాదానికి దారితీశాయి.

టాస్క్ లో భాగంగా శివ వేసిన లేడీ గెటప్ ప్రస్తుతం కాంట్రవర్సీ గా మారింది.

లేడీ గెటప్ కోసం యాంకర్ శివ, అషు ని లో దుస్తులు అడగడం, షర్ట్ విప్పి చూపించు అని పదేపదే అనడంతో ఇంత రచ్చ జరిగిందో మనందరికి తెలిసిందే.

ఇదే విషయంపై తాజాగా జరిగిన ఎపిసోడ్ లో పెద్ద పంచాయతీ జరిగింది.ఇంట్లో ఉన్న ఆడవారు అందరినీ కన్ఫెక్షన్ రూమ్ లోకి రమ్మని చెప్పి నాగార్జున పిలిచాడు.

ఆ తరువాత అందరి అభిప్రాయాలను తెలుసుకున్నాడు.ఇక అందరు కూడా అది తప్పు అని అనగా, అరియానా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడింది.

దీంతో వీడియో వేసి చూపించడంతో అరియానా కూడా శివదే తప్పు అలా పదేపదే బట్టలు విప్పి బట్టలు విప్పు అని అనడం తప్పే అని ఒప్పుకుంది.

Telugu Akhil, Ashu, Baba Bhaska, Bigg Boss, Nagarjuna, Natraj Master, Siva-Movie

ఇదే విషయాన్ని సభ్యులందరి ముందు కూడా చెప్పి ఒప్పించాడు హోస్ట్ నాగార్జున.అనంతరం ఇంట్లో ఉన్న మగ కాంటెస్టెంట్ లను కూడా పిలిచి అదే అడిగడంతో అందరు కూడా శివదే తప్పు అని అన్నారు.కానీ బాబా భాస్కర్ మాత్రం శివ ఆ మాట అన్నప్పుడు అషు కాస్త సీరియస్ గా చూస్తే సరిపోయేది అని అన్నాడు.

అఖిల్, నట్రాజ్ మాస్టర్ లు అషు ని సపోర్ట్ చేశారు.అనంతరం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున శివ ని అలా అనడం తప్పు అంటూ మందలించాడు.

కానీ యాంకర్ శివ తాను చెడు ఉద్దేశంతో అలా అనలేదు అని చెబుతూనే అషు కీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు.మొత్తానికి ఈ వివాదానికి నాగార్జున పులిస్టాప్ పెట్టేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube