బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఆరోజే.. గెలిచిన వారికి ఎన్ని లక్షలు ఇస్తారంటే?

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది.మరికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ముగియనుంది.

 Bigg Boss Non Stop Grand Finale Date And Cash Prize Details, Mitra Sharma, Anil-TeluguStop.com

అయితే ఫైనల్ ఎపిసోడ్ దగ్గరపడుతుండటంతో కంటెస్టెంట్ లలో టెన్షన్ మొదలయ్యింది.తాజాగా జరిగిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్స్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు.

మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి లు ఈ ఏడుగురు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.ఇకపోతే ఈ వారంతో నాన్ స్టాప్ షో కి తెర పడనుంది.

సాధారణంగా అయితే ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే చివరి వారంలో ఉండేవారు.ఈసారి మాత్రం ఏడుగురు ఉన్నారు.

ఇక తాజా సమాచారం మేరకు ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ఎపిసోడ్ ను శనివారం నాడు చిత్రీకరించనున్నారు.దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.తాజా సమాచారం మేరకు గ్రాండ్ ఫినాలే, మే 21 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.ఇక బిందుమాధవి, అఖిల్ సార్థక్ టాప్ కంటెస్టెంట్లుగా వార్తల్లో నిలుస్తున్నారు.

కాబట్టి వీరిద్దరూ బిగ్ బాస్ నాన్ స్టాప్ ట్రోఫీ రేసులో ఉండేందుకు బలమైన కంటెస్టెంట్లు అని అంటున్నారు.సోషల్ మీడియాలో ప్రచారం దాని మేరకు ఈ ఫైనల్‌కు ప్రత్యేక అతిథులు ఎవరూ ఉండకపోవచ్చు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మాదిరిగానే, హోస్ట్ నాగార్జున విజేతకు ట్రోఫీని అందజేయనున్నారు.

Telugu Anil Rathod, Akhil Sardhak, Anchor Shiva, Ariana Glory, Baba Bhaskar, Bin

బిగ్ బాస్ నాన్‌స్టాప్ విజేత నగదు బహుమతి గురించి చెప్పాలంటే, ఈ సీజన్ విజేత విజేత బిగ్ బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు దాదాపు రూ.25 లక్షల నగదు బహుమతిని ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలుస్తోంది.టాప్ 5 విషయానికొస్తే బాబా భాస్కర్ ఐదో స్థానంలో అరియానా గ్లోరీ నాలుగో స్థానంలో ఉంది.

యాంకర్ శివ మూడో స్థానాల్లో ఉన్నారు.టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

మరి ఈ సారి టైటిల్ ను ఎవరు గెలుస్తారు అని ప్రేక్షకులలో కూడా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube