వామ్మో.. కంటిన్యూగా 21 గంటలు షూటింగ్ లో పాల్గొన్న మోనాల్ గజ్జర్!

బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో అభిమానులను ఆకట్టుకున్న జంట అఖిల్ ,మోనాల్ గజ్జర్.ఇక మోనాల్ గురించి బిగ్ బాస్ ముందు ఎవరికీ అంతగా పరిచయం లేదు.

 Bigg Boss Monal Gajjar Says 21 Hours Dance Shoot Continuously , Big Boss, Monal-TeluguStop.com

కానీ బిగ్ బాస్ తర్వాత తన గ్లామర్ తో ఎంతోమంది అభిమానులను గెలుచుకొని ప్రస్తుతం ఓ రేంజ్ లో అవకాశాలను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే అఖిల్ తో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అఖిల్, మోనాల్ నిజజీవితంలో కూడా రిలేషన్ లో ఉన్నట్లు ఎన్నో వార్తలు వినిపించాయి.అంతేకాకుండా పలు కార్యక్రమాలలో వీళ్ళు చేసే సందడిలు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటాయి.ఇదిలా ఉంటే వీరిద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా చేయనున్నారు.’ తెలుగు అబ్బాయి.గుజరాతి అమ్మాయి‘ అనే సిరీస్ లో నటించనున్నారు.ఇటీవలే ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా.ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి.ఇదిలా ఉంటే తాజాగా మోనాల్ షూటింగ్ లో 21 గంటలు విరామం లేకుండా పాల్గొన్నదట.

Telugu Hours, Akhil Sarthak, Big Boss, Dance Show, Monal Gajjar, Dance, Teluguab

బిగ్ బాస్ తర్వాత మోనాల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే.ఇక ఇందులో ఆమె చేసే ఎంట్రీ డాన్స్ లు, తెలుగులో తన మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో ను షేర్ చేయగా.ప్రస్తుతం అది వైరల్ గా మారింది.అందులో ఆమె డాన్స్ షో కోసం 21 గంటల పాట షూటింగ్ చేసినట్లు తెలిపింది.అంత సేపు కష్టపడిన ఇప్పటికి ఎంత ఫ్రెష్ గా ఉన్నానోనంటూ.

ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube