నా అనుకున్న వాళ్లే దారుణంగా మోసం చేశారు : మెహబూబ్  

నటుడిగా, డ్యాన్సర్ గా, యూట్యూబర్ గా మెహబూబ్ దిల్ సే అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మెహబూబ్.యూట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచితమైన మెహబూబ్ బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.

TeluguStop.com - Bigg Boss Mehaboob Sensational Comments About His Friends

పది వారాల పాటు బిగ్ బాస్ షోలో ఉన్న మెహబూబ్ తక్కువ ఓట్లు రావడం వల్ల పదవ వారం ఎలిమినేట్ అయ్యారు.

మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే గతంలో ఏ ఎలిమినేషన్ సమయంలో జరగని విధంగా హౌస్ మేట్స్ అంతా కన్నీటి పర్యంతం అయ్యారు.

TeluguStop.com - నా అనుకున్న వాళ్లే దారుణంగా మోసం చేశారు : మెహబూబ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మెహబూబ్ ఎవరిపై విమర్శలు చేయలేదు.అయితే తాజాగా మెహబూబ్ నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన స్నేహితుల గురించి మాట్లాడుతూ మెహబూబ్ ఈ కామెంట్లు చేశారు.

Telugu About His Friends, Mehaboob Dilse, Mehaboob Sensational Comments, Youtube Channel-Latest News - Telugu

తనకు ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో అవకాశం దక్కిందని ఆ షోలో ఛాన్స్ రావడం ఎంతో సంతోషం కలిగించిందని మెహబూబ్ అన్నారు.బిగ్ బాస్ షోకు వెళ్లే కొన్ని రోజుల ముందు తన స్నేహితులకు, బాగా పరిచయం ఉన్నవాళ్లకు తాను బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నానని సపోర్ట్ చేయాలని కోరానని కానీ ఎలిమినేట్ అయిన తరువాత తన ఫ్రెండ్స్ ఎలాంటి సపోర్ట్ చేయలేదని తెలిసి అవాక్కయ్యానని తెలిపారు.

అయితే తన స్నేహితులు సపోర్ట్ చేయకపోయినా పెద్దగా బాధ వేయలేదని కొందరు ఫ్రెండ్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి మూడు వారాల్లోనే బయటకు వస్తావని భావించామని కానీ పదివారాలు ఉన్నావంటూ బాధ పెట్టేలా కామెంట్లు చేశారని అన్నారు.

బయట పరిస్థితులకు, బిగ్ బాస్ హౌస్ కు చాలా తేడా ఉంటుందని తెలిసిన వాళ్లు లేకపోవడం వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతామని.కానీ నమ్మిన స్నేహితులు తనను మోసం చేస్తారని తాను అనుకోలేదంటూ మెహబూబ్ కామెంట్లు చేశారు.

#Mehaboob Dilse #Youtube Channel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు