పాటను చిరంజీవికి అంకితం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..?  

bigg boss 4 contestant mehaboob dedicated song to megastar chiranjeevi, bigg boss, season 4, sohel, divi, vedalam, dedicated, youtube channel, dil se mehaboob, viral - Telugu 4 Laksh Views, 8 Lakh Subscribers, Bigg Boss, Bigg Boss Mehaboob, Dedicated, Dil Se Mehaboob, Divi, Evaru Raa Aa Pilla Song, Season 4, Sohel, Vedalam, Viral, Youtube Channel

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవి గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.మెహబూబ్ కు చిరంజీవి స్టేజ్ పైనే తన దాతృత్వాన్ని చాటుకుని 10 లక్షల రూపాయలను మెహబూబ్ కు ఇచ్చారు.

TeluguStop.com - Bigg Boss Mehaboob Dedicated Song To Megastar Chiraneevi

సోహైల్ తన ప్రైజ్ మనీలో కొంత మొత్తం మెహబూబ్ కు ఇవ్వాలని భావించగా ఆ డబ్బును మీకోసం వినియోగించుకోవాలని సూచిస్తూ మెగాస్టార్ చెక్ రాసి ఇచ్చి గొప్ప మనస్సును చాటుకున్నారు.

చిరంజీవి చెక్ ఇవ్వడంతో మెహబూబ్ కన్నీటి పర్యంతం కావడంతో పాటు మెగాస్టార్ కు పాదాభివందనం చేశారు.

TeluguStop.com - పాటను చిరంజీవికి అంకితం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కు చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తానని హామీ ఇచ్చారు.మరో కంటెస్టెంట్ దివికి వేదాళం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇస్తున్నట్టు తెలిపారు.

బిగ్ బాస్ షోలో దివి పెర్ఫామెన్స్ చూసి ఆమె కొరకు స్పెషల్ పాత్రను క్రియేట్ చేసినట్టు చిరంజీవి తెలిపారు.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ యూట్యూబ్ ఎవరురా ఆ పిల్లా పేరుతో ఒక పాటను రిలీజ్ చేశారు.ఆ పాటను మెహబూబ్ మెగాస్టార్ చిరంజీవికి అంకితం చేశారు.మెగాస్టార్ కటౌట్, మెగాస్టార్ సినిమా పోస్టర్లతో స్టార్ట్ అయిన ఈ పాటకు 4 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ పాటలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కొన్ని సెకన్ల పాటు కనిపించారు.సోషల్ మీడియాలో ఈ పాట తెగ వైరల్ అవుతోంది.

ఈ పాటను సింగర్ రేవంత్ పాడగా జావేద్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు.స్వయంకృషి ఈ పాటకు లిరిక్స్ రాయగా ఫణి నారాయణ ట్యూన్ ను కంపోజ్ చేశారు.

దిలె సే మెహబూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట విడుదల కాగా ఈ ఛానల్ కు 8 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

#Bigg Boss #Season 4 #Divi #Youtube Channel #Dil Se Mehaboob

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు