బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది.ఇక ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అనేది బాగా ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం అందులో ఐదుగురు కంటెస్టెంట్ లు ఉండగా అందులో సిరి తప్ప మిగిలిన నలుగురు బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లని అర్థమవుతుంది.పైగా సిరి ఎలాగైనా ఎలిమినేట్ అవుతుంది అని ఇక ఈ నలుగురిలో ఎవరు విన్ అవుతారు అనేది ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం నారదముని గా పేరు తెచ్చుకుంది.
ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్లి వాళ్ల పర్సనల్ విషయాలను తెలుసుకొని మరి బయట పెట్టేది.దీంతో ఆమెను హౌస్ లో ఉన్న వాళ్లంతా బాగా వ్యతిరేకించారు.
ముఖ్యంగా తనకు బాగా సపోర్ట్ చేసే వాళ్లకు మాత్రం తను కూడా చాలా సపోర్ట్ చేసేది.తప్పు ఉంటే మాత్రం గట్టిగా నిలదీసేది.
అలా చాలా వరకు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఎప్పుడు నవ్వుతూ ఉండే కాజల్ ను హౌస్ లో ఉన్న వాళ్లంతా తన నవ్వు గురించి కాస్త వ్యతిరేకించడంతో తాను అవేవి పట్టించుకోకుండా నేను ఇలానే ఉంటాను అని అందరికీ చెప్పేసింది.

చాలావరకు తనను హౌస్ లో ఉన్న వాళ్లంతా విమర్శించుకున్నా కూడా అవేవి పట్టించుకోకుండా.తనేంటో ప్రేక్షకులకు నచ్చటంతో 14వ వారం వరకు కొనసాగింది.అలా నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయింది.కానీ కాజల్ హౌస్ లో ఎంత తొందర పడిందో బయట కూడా అంతే తొందర పడింది.నిజానికి తన తొందరపాటు వల్ల కొన్ని కొన్ని సార్లు పొరపాటు కూడా చేసింది.
ఇప్పుడు బయట కూడా తొందర పడటం వల్ల మరో పొరపాటు చేసింది.
దీంతో ఆమెపై బిగ్ బాస్ నిర్వాహకులు ఫైర్ అవుతున్నారు.కారణమేంటంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో ప్రసారమయ్యే ఎపిసోడ్ లు అనేవి ఒకటి లేదా రెండు రోజుల ముందు షూటింగ్ లు జరుగుతుంటాయి.
అలా వారం చివరి షూటింగ్ కూడా ముందు రోజే జరుగుతుంది.

దీంతో ఆదివారం జరిగే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యే సభ్యులు శుక్రవారం లేదా శనివారం బయటకు వస్తారు.కానీ కొన్ని ఒప్పందాలతో మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది.అంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ చేయక ముందుకే బయటకు రావద్దని, అంతేకాకుండా బిగ్ బాస్ బజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చేవరకు కూడా బయటకు రావద్దని ముందే బిగ్ బాస్ నిర్వహకులు తెలుపుతారు.
అలా ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు ఇటువంటి ఒప్పందాలు పూర్తయ్యాక బయటికి వచ్చారు.కానీ కాజల్ మాత్రం తొందర పడింది.తన ఎపిసోడ్ టెలికాస్ట్ కాక ముందుకే తను ఓ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో పాల్గొని కాసేపు ముచ్చట్లు పెట్టిందని తెలిసింది.దీంతో ఆమెనే ఎలిమినేట్ అయ్యిందని సోషల్ మీడియాలో బాగా ప్రచారాలు వచ్చాయి.

ఈ విషయం బిగ్ బాస్ నిర్వాహకులకు తెలియడంతో.బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు బయట కనిపించకూడదని విషయం మీకు తెలియదా అంటూ ఆమెపై ఫైర్ అయినట్లు తెలిసింది.దీంతో నెట్టింట్లో బిగ్ బాస్ షో పై కూడా నెటిజన్లు తెగ కౌంటర్లు వేస్తున్నారు.అంతేకాకుండా ఆమె చేసిన పని వల్ల తెగ విమర్శలు కూడా వస్తున్నాయి.
మొత్తానికి కాజల్ తొందరపాటు వల్ల నెట్టింట్లో తెగ కౌంటర్లు వేస్తున్నారు.