బిగ్ బాస్ అలా ఉపయోపడిందంటూ ఇంటి గుట్టు విప్పిన కౌశల్!

తెలుగు సిని, టెలివిజన్ నటుడు కౌశల్.బాలనటుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Bigg Boss Kaushal One Day Life With Out Wife Video-TeluguStop.com

ఆ తర్వాత పలు సీరియల్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.బుల్లితెరలో డాన్స్ బేబీ డాన్స్ షో కు హోస్టింగ్ గా కూడా చేశాడు.

ఇదిలా ఉంటే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని టైటిల్ విన్నర్ దక్కించుకున్నాడు.అంతేకాకుండా అభిమానులలో కౌశల్ ఆర్మీ గా నిలిచాడు.

 Bigg Boss Kaushal One Day Life With Out Wife Video-బిగ్ బాస్ అలా ఉపయోగపడిందంటూ ఇంటి గుట్టు విప్పిన కౌశల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెండితెరపై పలు సినిమాలలో హీరో స్నేహితుడి గా, బావబామ్మర్ది వంటి పాత్రలలో నటించాడు.ఇక బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చేవరకు అందులో తన గేమ్ ని ఎంతో శ్రద్ధగా ఆడి మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు.ఇక టైటిల్ విన్నర్ తర్వాత కౌశల్ కొన్ని కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు.ఫౌండేషన్ డబ్బులను వృధా చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇప్పటివరకు ఎటువంటి అవకాశాలు అందుకోలేదు.కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు దగ్గర ఉంటాడు కౌశల్.

అంతేకాకుండా తనకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.అందులో ఎన్నో వీడియోలు తీస్తూ అభిమానులకు షేర్ చేస్తూ ఉంటాడు.

ఇక గతంలో ఆయన తన భార్య నీలిమ కు కరోనా సోకడంతో ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తన ఇంటి గుట్టు గురించి ఓ విషయం బయటపెట్టాడు.

తాజాగా తను ఒక వీడియో షేర్ చేశాడు.అందులో ఒకరోజు భార్య ఇంట్లో లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? అనే టైటిల్ తో వీడియో చేయగా.అందులో వంట వండుకోవడం, తన పని తాను చేసుకోవడం వంటివి బిగ్ బాస్ షో వల్ల అనుభవం కలిగిందని అలా అలవాటు అయ్యింది అని తెలిపాడు.బిగ్ బాస్ ఇంట్లో 200 ప్లేట్లు కడిగానని ఇదో పెద్ద విషయం కాదని తెలుపగా అందులో తన ఇంటి పనులతో పాటు పిల్లలతో గడిపిన సమయాన్ని బాగా షేర్ చేశాడు.

#Funny Video #Bigg Boss #Social Media #Kaushal Manda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు