బట్టలిప్పడానికి రెడీ అంటూ బూతు బంగ్లాగా మారిన బిగ్ బాస్ హౌస్..?

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ షో ప్రారంభమై దాదాపు 60 రోజులు కావడానికి వస్తుంది.

 Bigg Boss House Has Become Bold House They Are Ready To Undress Details,  Bigg B-TeluguStop.com

ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఓ రేంజ్ లో ఆడుతున్నారు.ఏ ఒక్కరు కూడా ఎక్కడ తగ్గేలా లేరు.

గత సీజన్ వాళ్ళ కంటే ఈ సీజన్ వాళ్లు బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.ఇక ఈ షో మొదటి రెండు వారం నుంచే బాగా హైలెట్ గా మారింది.

మొదటి వారంలోనే కాంట్రవర్సీలు ఎదురయ్యాయి.ప్రతి ఒక్కరు తమ పరిచయాలు పూర్తిగా పెంచుకోక ముందుకే గొడవలకు దిగారు.ఒకరినొకరు ద్వేషించుకొంటూ వాళ్ళ అసలు రూపాన్ని ఎలిమినేషన్ రౌండ్ లో చూపించారు.ఇక మధ్యమధ్యలో బూతుల పురాణం కూడా బాగానే వినిపించింది.

కెమెరాలు ఉన్నాయని కూడా పట్టించుకోకుండా తమ బూతు మాటలతో బాగా హాట్ టాపిక్ గా నిలిచారు.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి గురించి అందరికీ పరిచయమే.బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకర్ గా చేస్తూ మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటించాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను బిగ్ బాస్ లో పాల్గొని మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈవారం కెప్టెన్సీ భాగంలో బిగ్ బాస్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు టాస్క్ ఇచ్చాడు.ఇక సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ ఇవ్వగా అందులో కంటెస్టెంట్ లు అందరూ రెండు భాగాలుగా విడిపోయారు.సూపర్ విలన్స్ గా, సూపర్ హీరోస్ గా భాగాలుగా మారి ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

అందులో రవిని టార్గెట్ చేసి బాగా ఆడుతున్నారు సూపర్ హీరోస్ టీమ్ వాళ్ళు.షణ్ముఖ్ కాజల్ తో రవిని టార్గెట్ చేయాలని మాట్లాడుకుంటారు.ఇక రవి ఎలాగైనా గెలవాలి అని తనను బట్టలిప్పి నిలబడమన్నా నిలబడతా అంటూ గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

దీంతో అతడికి ఒంటినిండా పేడ పూసి, పేడ నీళ్లు పోసుకునేలా చేశారు.అంతేకాకుండా రకరకాల వాటితో జ్యూసులు చేసి తాగించారు.

అంతలోనే మానస్ డంబెల్స్ తీసుకువచ్చి తనతో వర్కౌట్ చేయించాడు.అప్పటికే ఆనీ మాస్టర్ రవికి బ్యాక్ పెయిన్ అని చెప్పినా కూడా వినకుండా బాగా టార్గెట్ చేశారు.మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ ని బూతు బంగ్లా గా మార్చారు అంటూ విమర్శలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube