బిగ్ బాస్ లో నాగార్జున ఫేవరెట్ కంటెస్టెంట్ అతనేనా..?  

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఎలిమినేషన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి లాస్య ఎలిమినేట్ కాగా లాస్య ఎలిమినేషన్ గురించి ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

TeluguStop.com - Bigg Boss Host Nagarjuna Praises Abhijeet Performance

అయితే బిగ్ బాస్ షోను చూసే ప్రేక్షకులు మాత్రం మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ నాగార్జునకు ఫేవరెట్ అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించినా నాగార్జున కొందరు కంటెస్టంట్లకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారని గతంలో ఎప్పుడూ అభిప్రాయాలు వ్యక్తం కాలేదు.

TeluguStop.com - బిగ్ బాస్ లో నాగార్జున ఫేవరెట్ కంటెస్టెంట్ అతనేనా..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ సీజన్ లో మత్రం అభిజిత్ నాగార్జున ఫేవరెట్ కంటెస్టెంట్ అని అతని విషయంలో నాగార్జున చాలా సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.నిన్నటి ఎపిసోడ్ లో అభిజిత్ బుట్టబొమ్మ పాటకు సరిగ్గా డ్యాన్స్ వేయలేదు.

అభిజిత్ డ్యాన్స్ సరిగ్గా వేయకపోయినా నాగార్జున అభిజిత్ సూపర్ అంటూ ప్రశంసించారు.మొదట్లో మిగతా కంటెస్టెంట్లతో పాటే అభిజిత్ ను కూడా నాగార్జున సమానంగా చూశాడని.గత కొన్ని వారాల నుంచి అభిజిత్ ను నాగార్జున తెగ ఎంకరేజ్ చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అభిజిత్ సరిగ్గా చేయకపోయినా మెచ్చుకున్న నాగార్జున మిగతా కంటెస్టెంట్లు అద్భుతంగా చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం.

అభిజిత్ విన్నర్ అవుతాడని సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతంగా ప్రచారం జరుగుతోంది.అభిజిత్ కోసం పీఆర్ టీం పని చేస్తోందని అందువల్లే అభిజిత్ ఎలిమినేషన్ లోకి వెళ్లినా సులభంగా సేవ్ అవుతున్నాడని తెలుస్తోంది.మరోవైపు సెలబ్రిటీలు సైతం అభిజిత్ విన్నర్ అవుతాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగా అభిజిత్ విన్నర్ అవుతాడో లేక మరో కంటెస్టెంట్ విన్నర్ అవుతారో చూడాల్సి ఉంది.

#Bigg Boss House #BiggBoss #AbhijeethDance #BiggBoss #Abhijeeth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Bigg Boss Host Nagarjuna Praises Abhijeet Performance Related Telugu News,Photos/Pics,Images..