తెలుగు బుల్లితెరపై తన ప్రయాణం మొదలుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి హిమజ( Himaja ) ఒకరు.బుల్లి తెర సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.
స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోను హీరో సిస్టర్ పాత్రలలోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.ఇక బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి హిమజ మంచి సక్సెస్ అందుకున్న ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి హిమజ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రాకపోవడం గురించి స్పందించారు.
తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారనే వాదన ఉంది.అందుకే వాళ్లకు ఆఫర్స్ రావడం లేదంటారు.
దీనిపై మీ అభిప్రాయం ఏమిటని హిమజను యాంకర్ అడిగింది.ఈ ప్రశ్నకు హిమజ సమాధానం చెబుతూ.
తెలుగు అమ్మాయిలు( Telugu Girls ) రిజర్వ్డ్ కాదని ఇప్పటికే రుజువైంది.విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు అలాగే అవకాశాలు వచ్చిన వారందరూ కూడా కమిట్మెంట్( Commitment ) ఇచ్చినవాళ్లు కాదు అంటూ ఇవే ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా స్పందించారు.చాలామంది తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి కాకపోతే వారి అత్యాశ కారణంగా కొన్ని అవకాశాలను వదులుకుంటూ ఉన్నారని హిమజా తెలిపారు.
ఇలా మన తెలుగు వారిని కాకుండా ఇతర భాష చిత్రాలలో నటిస్తున్న వారిని తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది.కొన్ని పాత్రలకు కొంతమంది మాత్రమే సూట్ అవుతారు అలాంటి తరుణంలోనే ఇతర భాష సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటారని తెలిపారు.ఇక హిమజ ప్రస్తుతం సినిమాలలో మంచి క్యారెక్టర్స్( Characters ) అందుకుంటున్నారు.
అయితే ఈమె కెరియర్ మొదట్లో కొన్ని సినిమాలలో పనిమనిషి పాత్రలలో కూడా నటించారు ఇలా వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకుంటేనే మంచి కెరియర్ ఉంటుందన్న ఉద్దేశంతోనే హిమజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.