ఇప్ప‌టి వ‌ర‌కు ఏ కంటెస్టెంట్‌కు ద‌క్క‌ని బంప‌ర్‌ ఆఫ‌ర్ దివి కొట్టేసిందిగా!  

bigg boss gives bumper offer for divi! bigg boss, bumper offer, divi, extra sleep, bigg boss 4, bigg boss telugu, latest news, housemates - Telugu Bigg Boss, Bigg Boss 4, Bigg Boss Telugu, Bumper Offer, Divi, Extra Sleep, Housemates, Latest News

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఏడో వారం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఇటీవ‌ల ప్రారంభ‌మైన ఈ షో రోజురోజుకు రంజుగా కొన‌సాగుతోంది.

TeluguStop.com - Bigg Boss Gives Bumper Offer For Divi

కొత్త కొత్త టాస్కుల‌ను బిగ్ బాస్ ఇస్తుంటే.వాటిని ఏదో ఒక విధంగా విజ‌యవంతం చేసి శ‌భాష్ అనిపించుకుంటున్నారు ఇంటి స‌భ్యులు.

ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు రెండు టాస్కుల‌ను ఇచ్చాడు.అందులో మొదటిది మ్యాట్రస్‌ టాస్క్‌.

TeluguStop.com - ఇప్ప‌టి వ‌ర‌కు ఏ కంటెస్టెంట్‌కు ద‌క్క‌ని బంప‌ర్‌ ఆఫ‌ర్ దివి కొట్టేసిందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంటి సభ్యులకు ఒక మెత్తటి పరుపును ఇచ్చాడు బిగ్‌బాస్‌.స్టాట్‌ బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా కలిసి ఆ పరుపు మీద పడుకోవాలని సూచించారు.ఎండ్ బ‌జ‌ర్ మోగే సమయానికి ఎవరైతే పరుపుపై పూర్తిగా పడుకుంటారో వాళ్లు గెలుస్తార‌ని బిగ్ బాస్‌ వివ‌రించారు.ఇక బజర్ మోగగానే ప‌రుపుపైకి దూకిన ఇంటి స‌భ్యులు.

ఒక‌రిని ఒక‌రు కింద‌కు తోసేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేశారు.

అయితే చివ‌ర‌కు ఈ టాస్క్‌లో దివి విజేత‌గా నిలిచింది.

ఇక టాస్క్‌లో విజ‌యం సాధించిన దివికి బిగ్ బాస్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.మ్యాట్రస్‌ టాస్క్ విజేత ఈ వారం మొత్తం ఆ పరుపు మీద నిద్రించ‌వ‌చ్చ‌ని బిగ్ బాస్ తెలిపారు.

అంతేకాకుండా, ఉదయం అందరిలా కాకుండా ఓ గంట సేపు ఎక్స్‌ట్రాగా పడుకోవచ్చునని అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చారు.

అయితే వాస్త‌వానికి పోయిన మూడు సీజ‌న్స్‌లోనూ ఏ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ ఇలాంటి ఆఫ‌ర్ ఇవ్వ‌లేదు.

కానీ, తాజా సీజ‌న్‌లో దివి ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింది.ఇక ఆ టాస్క్‌ పూర్తి అయిన తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ బ్లాక్‌బస్టర్ సినిమా తీయాలంటూ టాస్క్‌ ఇచ్చాడు.

ఈ టాస్క్‌ను కూడా కిందా మీదా ప‌డి ఎలాగోలా ఇంటి స‌భ్యులు పూర్తి చేసేశారు.

#Bumper Offer #Extra Sleep #Housemates #Bigg Boss 4 #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Gives Bumper Offer For Divi Related Telugu News,Photos/Pics,Images..