మొన్న పార్వతి.. నేడు గంగవ్వ.. సొంత ఊరుకు బస్సు వచ్చేలా చేశారుగా!

తెలుగు ప్రేక్షకులకు యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలంగాణ పల్లెటూరి భాషలో మాట్లాడుతూ, తన మాటలతో చేష్టలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

 Bigg Boss Gangavva Initiative Bus Service Lambadipally Bigg Boss, Gangavva, Bus-TeluguStop.com

యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ, తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ హౌస్ లో వాతావరణం వల్ల తనకు హెల్త్ సరిగా లేకపోవడంతో అనుకోకుండా బయటకు వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత గంగవ్వ క్రేజ్ కూడా మారిపోయింది.ఇక తనకున్న క్రేజ్ తోనే సినిమాల్లో కూడా నటిస్తోంది.

గంగవ్వ కు యూత్ తో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మరీ ముఖ్యంగా గంగవ్వ కామెడీని, కామెడీ టైమింగ్ ను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.

ఇకపోతే గంగవ్వ లవ్ స్టోరీ, మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజ రాజ చోర సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇటీవలే గంగవ్వ తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకుంది.

గంగవ్వ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది.ఇది ఇలా ఉంటే కష్టపడి పైకి వచ్చి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే గంగవ్వ, తాజాగా తన సొంత ఊరికి బస్సు సర్వీసులు కూడా తీసుకు వచ్చింది.

Telugu Bigg Boss, Bus, Gangavva, Ismart Shankar, Lambadi Pally, Mallesam, Raja R

గంగవ్వ ది తెలంగాణ లోని జగిత్యాల జిల్లా, మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామం.అయితే మొదట్లో ఈ గ్రామానికి బస్సు సర్వీసులు ఉండేవి.కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ ఊరికి దాదాపుగా రెండేళ్లపాటు బస్సులు నిలిపివేశారు.దీంతో గ్రామస్తులు,వ్యవసాయ కూలి దారులు,విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.

ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలి అంటే వాహన చార్జీలు భారమయ్యాయి.దీనితో లంబాడి పల్లి గ్రామ ప్రజలు వారి సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీస్ లను తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు.

ఇందుకోసం గంగవ్వ సహాయం కోరారు.ఊరిలోని కొందరు వ్యక్తులు అలాగే గంగవ్వ అందరూ కలసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిశారు.

గంగవ్వ వినతి తో లంబాడిపల్లి కి బస్సు సర్వీసులను పునరుద్ధరించారు అధికారులు.లంబాడిపల్లి కి బస్సు తిరిగి రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే సింగర్ పార్వతి కూడా పాట పాడి వారి ఊరికి బస్సును రప్పించుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube