అబ్బో.. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ కి అంత రేటింగ్ వచ్చిందా?

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ షోకు అవేవీ సాటి రావు.స్టార్ హీరో హోస్ట్ గా మనకు తెలిసిన సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో వాళ్లు నిజ జీవితంలో ఎలా ఉంటారనే ఆసక్తే ఈ షో హిట్ అవ్వడానికి కారణమవుతోంది.

 Bigg Boss4 Highest Trp Ratings,bigg Boss 4 First Episode, Shocking Rating, Akkin-TeluguStop.com

బిగ్ బాస్ తొలి సీజన్ కు తారక్ హోస్ట్ చేయగా రెండో సీజన్ కు నాని మూడు, నాలుగు సీజన్లకు అక్కినేని నాగార్జున హోస్ట్ లుగా చేశారు.

ఈరోజు గురువారం కావడంతో బార్క్ రేటింగ్స్ వెల్లడయ్యాయి.

బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్ ను అందుకుంది.బిగ్ బాస్ షో ఫస్ట్ ఎపిసోడ్ కు ఏకంగా 18.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని కంటెస్టెంట్లను 16 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి ఆ తరువాత హౌస్ లోకి పంపించారు.

ఆ కష్టానికి తగిన ఫలితం టీఆర్పీ రేటింగ్ రూపంలో కనిపిస్తోంది.

ఒక రియాలిటీ షో ఈ స్థాయి టీఆర్పీ రేటింగ్ సాధించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

బిగ్ బాస్ తెలుగు సీజన్లలో లాంఛింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లలో ఇదే హైయెస్ట్ కావడం గమనార్హం.కరోనా, లాక్ డౌన్ వల్ల థియేటర్లు తెరుచుకోకపోవడంతో ప్రజలు వినోదం కోసం టీవీ, యూట్యూబ్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై ఆధారపడుతున్నారు.

షోలో వీళ్లే పాల్గొనబోతున్నారంటూ చాలా పేర్లు వినిపించినా ఎవరు పాల్గొనబోతున్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.

ముక్కూమొహం తెలియని సెలబ్రిటీలు వచ్చారని విమర్శలు వ్యక్తమైనా బిగ్ బాస్ షోను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.

అయితే లాంఛింగ్ ఎపిసోడ్ ఆకట్టుకున్నా వీక్ డేస్ లో మాత్రం బిగ్ బాస్ వీక్ గానే ఉంది.వీక్ డేస్ లో బిగ్ బాస్ రేటింగ్ 8.15 కావడం గమనార్హం.తొలివారం ఏడుపులతో సాగిన బిగ్ బాస్ షో రెండో వారం మోనాల్ అభిజిత్ అఖిల్ ప్రేమాయణం వల్ల ట్రాక్ లో పడిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube