అమ్మాయిలకు మరోసారి హ్యాండిచ్చిన బిగ్ బాస్..?  

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాంఢ్ ఫినాలేకు ఇప్పటికే డేట్ ఫిక్సైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నలుగురు మేల్ కంటెస్టెంట్లు, ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.

TeluguStop.com - Bigg Boss Female Contestants Out From Title Race

బిగ్ బాస్ ప్రేక్షకులు ఈ సీజన్ లో అభిజిత్, అఖిల్, సొహైల్ లలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.అరియానా, హారిక, మోనాల్ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కోసం కష్టపడుతున్నా వాళ్లు విన్నర్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ సీజన్ లో లేడీ కంటెస్టెంట్లు రన్నర్ కూడా కావడం కష్టమేనని తెలుస్తోంది.దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులు అమ్మాయిలకు బిగ్ బాస్ మరోసారి హ్యాండ్ ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.

TeluguStop.com - అమ్మాయిలకు మరోసారి హ్యాండిచ్చిన బిగ్ బాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతంగా ప్రసారం కాగా మూడు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ షో విన్నర్ అయ్యారు.బిగ్ బాస్ షో సీజన్ 4 ప్రారంభంలో 9 మంది ఫిమేల్ కంటెస్టెంట్లు, ఏడుగురు మేల్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే వైల్డ్ కార్డ్ లో ఇద్దరు మేల్ కంటెస్టెంట్లు, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ హౌస్ లోకి వచ్చారు.సీజన్ 4లో ఏకంగా పది మంది ఫిమేల్ కంటెస్టెంట్లు పాల్గొన్నా అబ్బాయిలే టైటిల్ విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.హౌస్ లో ఉన్న మోనాల్, అరియానా, హారికలకు బయట పెద్దగా ఫాలోయింగ్ లేదు.ఇతర భాషల్లో లేడీ కంటెస్టెంట్లు విన్ అవుతున్నా తెలుగులో మాత్రం విన్ కాకపోవడం గమనార్హం.
ఈ సీజన్ లో కూడా మేల్ కంటెస్టెంట్ విన్ అయితే మాత్రం భవిష్యత్తులో జరిగే బిగ్ బాస్ షోలకు లేడీ కంటెస్టెంట్లు రావడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది.అయితే గ్రాండ్ ఫినాలేకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అరియానా, హారిక, మోనాల్ లలో ఎవరో ఒకరు టైటిల్ గెలిచి బిగ్ బాస్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారేమో చూడాల్సి ఉంది.

#Ariyana #BiggBoss #IsBigg #Monal #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Female Contestants Out From Title Race Related Telugu News,Photos/Pics,Images..