40 పెళ్లిళ్లు చేసుకుంటా.. వనిత విజయ్ కుమార్ ఫైర్!

వనిత విజయ్ కుమార్.ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Bigg Boss Fame Vanitha Vijaya Kumar Says I Will Have 4 Weddings And 40 Weddings-TeluguStop.com

మూడు పెళ్లిళ్లు చేసుకుని,ముగ్గురు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత ఆ పెళ్లి పెటాకులు కావడంతో వనిత విజయ్ కుమార్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టారు.ఈ క్రమంలోనే తమిళ పవర్ స్టార్ శ్రీనివాస్ తో కలిసి వనిత “పికప్ అండ్ డ్రాప్” సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమాప్రమోషన్ లో భాగంగా వీరిరువురు పెళ్లి చేసుకుని దండలు మార్చుకున్నటువంటి ఫోటోలు వనిత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

 Bigg Boss Fame Vanitha Vijaya Kumar Says I Will Have 4 Weddings And 40 Weddings-40 పెళ్లిళ్లు చేసుకుంటా.. వనిత విజయ్ కుమార్ ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఆమెపై దారుణంగా ట్రోల్ చేశారు.

ఈ క్రమంలోనే వనిత అది కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వనిత తన సినిమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం అలవాటు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Telugu Bigg Boss, Vanitha, Vijaya Kumar, Weedings-Movie

తాజాగా ఈ విషయంపై నటి వనిత స్పందించారు… నేను శ్రీనివాస్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఈ ఫోటోని షేర్ చేశాను.ఈ ఫోటో షేర్ చేయటం వల్ల మేం అనుకున్న స్థాయిలో ప్రమోషన్ జరిగిందని తెలిపారు.ఇక సమాజం మహిళల వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ ఇవ్వాలి.

మగవాళ్ళు నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేదు కానీ ఆడవాళ్ళు చేసుకుంటే మాత్రం అదొక తప్పుగా వేలెత్తి చూపడంతోనే ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.అవసరమైతే 4 కాదు…40 పెళ్లిళ్లు చేసుకుంటా.

.అంటూ నెటిజన్ల పై వనిత ఫైర్ అయ్యారు.

ఇక సినిమాలకు స్వస్తి పలికినప్పుడు రాజకీయాలలోకి ప్రవేశిస్తానని నటి ఈ సందర్భంగా తెలిపారు.

#Bigg Boss #Weedings #Vanitha #Vijaya Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు