బిగ్ బాస్ సిరికి అంత క్రేజ్ పెరిగిందా.. ఉమెన్ కార్డు కారణమా?

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 కి రోజు రోజుకీ ఆదరణ పెరుగుతూ వస్తోంది.బుల్లి తెరలో ప్రసారమయ్యే అన్ని షోల కన్నా బిగ్ బాస్.

 Bigg Boss Siri Hanmanth Reaches Four Lakh Followers On Instagram, Bigg Boss 5,-TeluguStop.com

అందనంత ఎత్తులో ఉండి భారీ టీఆర్పీ రేటింగ్స్ ని నమోదు చేస్తోంది.షో ప్రారంభమై వారం దాటింది.

ఇప్పటి వరకు కొంచెం ఏదో అలా అలా సాగిపోతున్న ఈ హౌజ్ లో.రోజుకో కొత్త గొడవ, రోజుకో కొత్త విషయంతో ప్రేక్షకులను అలరిస్తునే ఉంది.బిగ్ బాస్ కూడా.టాస్క్ లు, లవ్ ట్రాక్ లు నడిపించడంలో అప్పుడే బిజీ అయిపోయారు.

దాదాపు హౌస్‌లోని కంటెస్టెంట్లందరూ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించీ టాస్కుల్లో విజయం సాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇలా టాస్క్ లలో విజయం సాధించడం కోసం ఒకరికొకరు పెద్ద ఎత్తున గొడవ పడతావు శత్రువులు గా మారుతున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి గుర్తింపు పొందిన వారు కొంత మంది ఉండగా కొంతమంది మొహాలు కూడా చాలా మందికి తెలియవు.ఇదిలా ఉండగా.

ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంటర్ అయిన యూట్యూబర్ సిరి హన్మంత్.ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తూనే బిగ్బాస్ నిర్వహించిన టాస్క్ లలో ఎంతో అద్భుతంగాఆడుతూ ఉమెన్ కార్డును కూడా ఉపయోగించినట్లు మనకు తెలిసిందే.

దాంతో బయట కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ కూడా అలానే పెరిగిపోతోంది.లాస్ట్ వీక్ లో సిరి .కెప్టెన్ గా ఎన్నికై … మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంది.ఇక సిరి హౌస్‌లో ఇలాగే జోష్‌తో ప్రతీ టాస్క్‌లోనూ అంతే ఉత్సాహంగా పాల్గొంటూ.

సందడి చేస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.కాగా, సిరి హన్మంత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షల ఫాలోవర్స్‌ను చేరుకుంది.

ఈ క్రమంలోనే సిరి ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఆమె టీం పోస్ట్ పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube