మా పాప బంగారం.. సంతోషంలో సిరి హన్మంత్ తల్లి?

Bigg Boss Fame Siri Hanmanth Mother Reacts Negative Comments Over Shanmukh

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకుని బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు.

 Bigg Boss Fame Siri Hanmanth Mother Reacts Negative Comments Over Shanmukh-TeluguStop.com

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేస్తున్న రొమాన్స్ కారణంగా ఇప్పటివరకు ఈమె సంపాదించుకున్న పేరు పూర్తిగా నాశనం చేసుకుంటుందని చెప్పవచ్చు.తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని ఇది తప్పు అని తెలిసిన తప్పడం లేదని ఈమె చెబుతూ షణ్ముఖ్ మరింత దగ్గరయింది.

ఇదిలా ఉండగా షణ్ముక్ సిరి వ్యవహారం గురించి ఎంతో మంది నెటిజన్లు వారి వ్యవహార శైలిపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై సిరి తల్లి స్పందించారు.

 Bigg Boss Fame Siri Hanmanth Mother Reacts Negative Comments Over Shanmukh-మా పాప బంగారం.. సంతోషంలో సిరి హన్మంత్ తల్లి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా సిరి తల్లి మాట్లాడుతూ సిరి అసలు పేరు శిరీష. తను పుట్టి పెరిగింది వైజాగ్ లోనే.

నిజజీవితంలో సిరి ఎంతో చలాకీగా ఉంటూ పదిమందికి సహాయం చేయాలనే మనస్తత్వం కలది.అందుకే ఆమెను డాక్టర్ని చదివించి పది మందికి వైద్య సేవలు అందించాలని నేను తనని ప్రత్యేక తరగతులకు పంపిస్తే తను మాత్రం డాన్స్ పై ఉన్న ఇష్టంతో డాన్స్ క్లాసులకు వెళ్లి ఇండస్ట్రీ వైపు వచ్చింది.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తను తన ప్రతిభతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని చివరికి బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకుందని వెల్లడించారు.

బిగ్ బాస్ హౌస్ లో కూడా సిరి ఎంతో అద్భుతంగా ఆడుతోందని ఖచ్చితంగా తను ఈ కార్యక్రమంలో చివరి వరకు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.రియల్ లైఫ్లో కూడా సిరి ఎవరితో గొడవలు లేకుండా ఎంతో మంచిగా ఉండేదని అలాంటి అమ్మాయిని టీవీలో చూసి ఎవరు ఒక నిర్ణయానికి రావద్దని మా పాప బంగారం ఎవరో గిట్టని వారే ఇలా తన గురించి తప్పుగా కామెంట్లు చేస్తున్నారు అంతే కానీ తన కూతురు చాలా మంచిదని బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా ఆడుతోంది అంటూ తన తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

#Shanmukh #Shanmukh #Bigg Boss #SiriMother #SiriHanmanthu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube