Shobha Shetty : డబ్బు కోసం ఆ పని చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ శోభాశెట్టి.. ఆ వ్యాపారంలో సక్సెస్ అవుతారా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి శోభా శెట్టి( Bigg Boss Shobha Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

 Bigg Boss Fame Shobha Shetty Starts New Business Seems She Is Not Interested In-TeluguStop.com

ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యింది.ఈ సీరియల్ కంటే ముందు పలు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ ఒక్క సీరియల్ తో దక్కింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కాగా శోభా ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ 7( Bigg Boss 7 ) లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె హౌస్ లో 11 వారాలకు పైగా రాణించి ఈ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.అయితే శోభా శెట్టికి బిగ్ బాస్ ఎంత క్రేజ్ తీసుకువచ్చిందో అదే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకుంది.

చిన్న విషయాలకు కూడా గొడవ పడడం, ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడం, తానే సాధించాలి అనే పంతం శోభా శెట్టిపై ట్రోలింగ్ జరిగేలా చేశాయి.

Telugu Actressshobha, Bigg Boss, Retailwholesale, Shobha Shetty, Tollywood, Yash

అయితే అందరికంటే ఎక్కువ నెగిటివిటీతో శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చింది.అయితే తాజాగా శోభా శెట్టి తన సొంత ఇంటి కల( Own House ) నెరవేర్చుకుంది.ఏడాదిన్నర క్రితమే ఆ ఇంటిని శోభా శెట్టి కొన్నప్పటికీ రీసెంట్ గా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇంటి తాళాలని శోభా పొందింది.

తన తల్లి, ప్రియుడు కాబోయే భర్త యశ్వంత్( Yashwanth ) తో కలసి కొత్త ఇంట్లోకి వెళ్ళింది.కాగా శోభా బుల్లితెర నటుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే శోభా శెట్టి ప్రస్తుతం సీరియల్స్ లో కనిపించడం లేదు.బిగ్ బాస్ షో అనంతరం ఆమె నటన పట్ల ఆసక్తి చూపడం లేదు.

Telugu Actressshobha, Bigg Boss, Retailwholesale, Shobha Shetty, Tollywood, Yash

ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకుంది.తన ఆలోచనలు అమలులో పెట్టడం స్టార్ట్ చేసింది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టి ఒక టాక్ షో చేస్తోంది.సుమన్ టీవీలో కాఫీ విత్ శోభ శెట్టి( Coffee with Shobha Shetty ) పేరుతో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది.

పలువురు సెలెబ్స్ ని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే ఎలాంటి సీరియల్స్ ఒప్పుకోలేదు.

Telugu Actressshobha, Bigg Boss, Retailwholesale, Shobha Shetty, Tollywood, Yash

ఆమె ఒక మేకప్ స్టూడియో పెట్టింది.తనకు మేకప్ పై అవగాహన ఉన్న నేపథ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఆమె భావిస్తున్నారు.తాజాగా మరో బిజినెస్ స్టార్ట్ చేసింది.సూరత్ వెళ్లిన శోభా శెట్టి అక్కడ హోల్ సేల్ కి చీరలు కొన్నది.ఆ చీరలు తన మేకప్ స్కూల్ వచ్చే కస్టమర్స్ కి అమ్మాలి అనుకుంటుందట. రిటైల్ అండ్ హొల్ సేల్ గా చీరలు( Retail and Wholesale Sarees ) అమ్మాలని ఆమె నిర్ణయం తీసుకుందట.

ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పిన శోభ శెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టింది.సీరియల్స్ లో నటించడం వలన వచ్చే ఆదాయం తక్కువే కాబట్టి బిజినెస్ బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube