మై లవ్ ఈజ్ గాన్ అంటూ షణ్ను లేటెస్ట్ వీడియో... ఏకిపారేస్తున్న నెటిజెన్లు!

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.అదే విధంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన వారి జీవితాలు కూడా అదేవిధంగా మారిపోతూ ఉంటాయి.

 Bigg Boss Fame Shanmukh Jaswanth My Love Is Gone Video Song Goes Viral, Shanmukh-TeluguStop.com

కొందరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి మంచి పాపులారిటీ సంపాదించుకుంది,ఇంకొందరు అదే పాపులారిటీతో వెళ్లి బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకుని బయటకు వస్తున్నారు.తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అదే జరిగింది.

యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్, సిరి లు బోలెడంత పాపులారిటీతో షో లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ ఊహించని విధంగా అంతకు రెండింతలు నెగిటివిటీ ని మూట కట్టుకొని బయటికి వచ్చారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరు చేసిన పనులకు ప్రేక్షకులు మండిపడే వారు.వారిద్దరిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేసేవారు.ఇక మామూలు వాళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే వారిద్దరి లవర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరూ చేసిన అరాచకాలను చూసి షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన ఏకంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది.

మరొక వైపు సిరి హనుమంతు పరిస్థితి కూడా అదే.సిరి, తన ప్రియుడు శ్రీహాన్ కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కలవడం, మాట్లాడటం కానీ చేయలేదు.శ్రీహాన్ ఒంటరిగా టూర్లను ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు.వీరిద్దరూ కనీసం బర్తడే లు కూడా విష్ చేసుకోవడం లేదు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీప్తి సునైనా బ్రేకప్ చెప్పడంతో షణ్ముఖ్ జస్వంత్ తన లైఫ్ తనదే అన్నట్లుగా ఉంటున్నాడు.మరొకవైపు దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్పీడ్ పెంచేసింది.ఇదిలా ఉంటే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేయగా ఆ వీడియోను చూసిన నెటిజన్లు అతన్ని ఏకిపారేస్తున్నారు.ఆర్య 2 సినిమాలో మై లవ్ ఇస్ గాన్ అనే పాటకు స్టెప్పులు వేసి అందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ఇక ఆ సాంగ్ దీప్తి సునైనా కోసం పెట్టలేదు అని షణ్ముఖ్ చెబుతున్నప్పటికీ నెటిజన్స్ అవేవీ పట్టించుకోకుండా అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు.ఇక త్వరలోనే ఫిబ్రవరి 14 లవర్స్ డే రాబోతోంది.

ఈ నేపథ్యంలోనే స్టార్ మా వాళ్ళు ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి ఉంటారు.అందులో భాగంగానే ఆ సాంగు ప్రిపరేషన్ లో ఈ వీడియో వదిలి ఉంటారు అని కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube