బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణకి కరోనా పాజిటివ్  

Bigg Boss Fame Ravikrishna Have Corona Positive, Tollywood, Telugu Cinema, South Cinema, Television Serials, Corona Effect - Telugu Bigg Boss Fame Ravikrishna Have Corona Positive, Corona Effect, South Cinema, Television Serials, Telugu Cinema, Tollywood

తెలుగు టెలివిజన్ సీరియల్ నటులని కరోనా భయపెడుతుంది.లాక్ డౌన్ సడలింపుల తర్వాత తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు రోజు రోజకి పెరిగిపోతూ ఉన్నాయి.

 Bigg Boss Fame Ravikrishna Have Corona Positive

ఈ కరోనా బాధితులలో మొన్నటి వరకు సామాన్యులు ఉంటే ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు.లాక్ డౌన్ సడలింపుల తర్వాత సినిమా, సీరియల్ షూటింగ్ లకి అనుమతి ఇచ్చారు.

ఈ నేపధ్యంలో సినిమాలు పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోయినా సీరియల్స్ మాత్రం స్టార్ట్ చేసారు.అయితే ఇక్కడే అసలు ప్రమాదం మొదలైంది.

బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణకి కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

సీరియల్స్ స్టార్ట్ చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్నారు.

ఆ మధ్య సూర్యకాంతం సీరియల్ నటుడు కరోనా బారిన పడగా తరువాత నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ లో నటిస్తున్న మలయాళీ యాక్టర్ నవ్యా స్వామి కరోనా బారిన పడింది.

ఇప్పుడు ఆమె కథ సీరియల్ లో నవ్య స్వామి కోస్టార్ గా నటిస్తున్న బిగ్ బాస్ ఫేం రవికృష్ణ కూడా కరోనా బారిన పడ్డాడు.ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.

తనకి టెస్టింగ్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు.అభిమానుల ఆశీర్వాదలతో త్వరలో కరోనా నుంచి బయటపడతా అని ట్వీట్ చేశారు.

ఇక ఇప్పుడు ఆమె కథ సీరియల్ యూనిట్ లో ఇంకెంత మంది కరోనా బారిన పడ్డారో అనేది తెలియాల్సి ఉంది.

#Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Fame Ravikrishna Have Corona Positive Related Telugu News,Photos/Pics,Images..