తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం ఇటీవల ఎంగేజ్మెంట్ రింగ్‌ను చేతికి పెట్టుకోవడంతో అంతా కూడా ఈ అమ్మడు పెళ్లికి సిద్దం అయ్యిందని భావించారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ అమ్మడు తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటన విషయమై అలాంటి ఫొటో పెట్టింది.
ఆ విషయం చాలా ఎత్తున వైరల్ అవ్వడంతో పున్ను చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పున్ను మరియు ఉద్బవ్ రఘునందన్ ప్రధాన పాత్రల్లో ఆహా కోసం రెడీ అయిన కమిట్ మెంటల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
ఈ సందర్బంగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.పున్ను ఈ వెబ్ సిరీస్ లో కాస్త బోల్డ్ గా కనిపించబోతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.
వెబ్ సిరీస్‌లు అంటేనే బోల్డ్ కంటెంట్ అంటూ ఒక ముద్ర పడిపోయింది.అందుకే ఈ వెబ్ సిరీస్‌ను కూడా అందుకు ప్రత్యేకంగా కాకుండా అలాగే రెడీ చేయడం జరిగింది.
పున్ను మరియు రఘునందన్‌ల మద్య లవ్ స్టోరీ ఆ తర్వాత బ్రేకప్ ఇవన్నీ కలిపి ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
నవంబర్ 13వ తారీకున స్ట్రీమింగ్ జరుగబోతున్న ఈ వెబ్ సిరీస్ యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ ప్రేక్షకులు ఇప్పటికే ఒక అవగాహణకు వచ్చారు.
పున్ను కాస్త లావు అయినట్లుగా అనిపిస్తుంది.ఇందులో ఈమె అల్ట్రా మోడ్రన్ అమ్మాయి మాదిరిగా కనిపించబోతుంది.ప్రేమలో ఉన్న అమ్మాయి అతడి వల్ల పదే పదే పడే ఇబ్బందులు చుట్టు జనాలు అనే మాటలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా బాగా నటించంది.హీరోయిన్గా తీవ్ర ప్రయత్నాలు చేసిన పున్ను పలు కారణాల వల్ల ఛాన్స్ లు కనిపించడం లేదు.
ఆ కారణం వల్లే ఈ అమ్మడు ఇలా వెబ్ సిరీస్‌ల దారి పట్టింది.ప్రతి వెబ్ సిరీస్‌లో కూడా బూతు కంటెంట్ ను జొప్పించే ఆహా వారు ఇందులో కాస్త రొమాంటిక్ పాళ్లను తగ్గించినట్లుగా అనిపిస్తుంది.
అయితే బోల్డ్ డైలాగ్స్ మరియు కొన్ని రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉండే అవకాశం కనిపిస్తుంది.