జంటగా మారబోతున్న మోనాల్ అఖిల్ .. ఏం జరిగిందంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో మోనాల్ అఖిల్ ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలిగి మంచి జోడీగా పేరు తెచ్చుకున్నారు.ఒక రకంగా బిగ్ బాస్ సీజన్ 4 ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి మోనాల్ అఖిల్ జంటే కారణమని చెప్పవచ్చు.

 Bigg Boss Fame Monal And Akhil Doing Web Series,monal, Akhil, Telugu Abbayi Guja-TeluguStop.com

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా మోనాల్ అఖిల్ వేర్వేరు ఆఫర్లతో బిజీ అవుతుండగా వాళ్లకు ఒకరికి మరొకరికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

పలుమార్లు అఖిల్ మోనాల్ సోహెల్ తో కలిసి పార్టీలు చేసుకోగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే అఖిల్ మోనాల్ ఒక వెబ్ సిరీస్ కోసం జంటగా మారనున్నారు.తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి పేరుతో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో ఈ జంట ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

మోనాల్ అఖిల్ జంటగా నటిస్తే ఈ వెబ్ సిరీస్ పై సహజంగా భారీగా అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

Telugu Akhil, Biggboss, Bigg Boss, Monal, Monal Akhil, Monal Gajjar, Teluguabbay

సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోనాల్ అఖిల్ జంటగా నటిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.ఏ భాస్కరరావు ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తుండగా భాస్కర్ బంతుపల్లి ఈ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అభిమానుల ఆశీర్వాదం కావాలని మోనాల్ అఖిల్ కోరారు.

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే మోనాల్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

గత నెలలో విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన మోనాల్ గజ్జర్ ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు అఖిల్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube