మోసం చేసి పారిపోయాడంటూ పోలీస్ కేసు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Bigg Boss Fame Julie Files Cheating Case Against Her Boyfriend

నటి,తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ జూలీ అమింజికరై ప్రియుడు పై పోలీస్ ఫిర్యాదు చేసింది.ప్రేమ పేరుతో తనను మోసం చేసి, నగలు డబ్బులు తీసుకొని పారిపోయాడు అంటూ ప్రియుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.అన్నానగర్ కు చెందిన మనీష్, జూలీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.అంతేకాకుండా ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట.

 Bigg Boss Fame Julie Files Cheating Case Against Her Boyfriend-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు మాయమాటలు చెప్పి ఇంట్లోని నగలు విలువైన వస్తువులతో పాటు నగదును కూడా తీసుకొని పారిపోయాడు.

కొద్దీ రోజులుగా తన ప్రియుడు జాడ తెలియకపోవడంతో ఆమె అన్నా నగర్ పోలీసులను ఆశ్రయించింది.

 Bigg Boss Fame Julie Files Cheating Case Against Her Boyfriend-మోసం చేసి పారిపోయాడంటూ పోలీస్ కేసు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తన ప్రియుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ఇకపోతే జూలీ విషయానికి వస్తే.ఈమె కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షో మొదటి సీజన్ కి సాధారణ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చింది.

ఇక గతంలో చెన్నైలో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఆమె బాగా ఫేమస్ అయ్యింది.

Telugu Bigg Boss, Bigg Boss Julie, Boyfriend, Julie-Movie

ఆ జల్లికట్టు ఉద్యమంలో జూలీ చేసిన నినాదాలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.దీంతో జూలీకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.బిగ్ బాస్ షో ద్వారా ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటెస్టెంట్ లో ఎక్కువగా గొడవపడి మధ్యలోనే బయటకు వచ్చేసింది.ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఒకవైపు హోస్ట్ గా వ్యవహరిస్తున్న మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

#Bigg Boss Julie #Bigg Boss #Boyfriend #Julie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube