శర్వానంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ హారిక  

ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది.అయితే మొదటి మూడు సీజన్స్ లో పాల్గొన్న పార్టిసిపెంట్ లకి పెద్దగా గుర్తింపు రాలేదు.

TeluguStop.com - Bigg Boss Fame Harika Got Offer In Sarvanand Movie

అలాగే సినిమాలలో అవకాశాలు కూడా రాలేదు.కొంత మంది ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ లకి కూడా బిగ్ బాస్ లో పాల్గొని బయటకి వచ్చిన తర్వాత అనూహ్యంగా అవకాశాలు తగ్గిపోయాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వంద రోజులు వారి ఒరిజినాలిటీ ఏంటి అనేది జనాలకి తెలిసిపోతుంది కాబట్టి సినిమాలలో మళ్ళీ వారి యాక్టింగ్ ని ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కారనే అభిప్రాయం ఉంది.బిగ్ బాస్ తమ కెరియర్ కి ఏ విధంగానూ ఉపయోగపడలేదని గత మూడు సీజన్స్ లో పాల్గొన్న పార్టిసిపెంట్ లు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

TeluguStop.com - శర్వానంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ హారిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయినా కౌశల్ కి బయటకి వచ్చిన తరువాత కొంత కాలం ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.అదే స్పీడ్ లో అతనికి హీరోగా అవకాశాలు వస్తాయని కూడా అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా అతని కెరియర్ స్పీడ్ కూడా బిగ్ బాస్ తర్వాత తగ్గిపోయింది.

అయితే ఈ సీజన్ లో పాల్గొన్న వారికి మాత్రం బిగ్ బాస్ మరింత క్రేజ్ తీసుకొచ్చింది అని చెప్పాలి.

హీరోయిన్ మోనాల్ గజ్జల్ కి బిగ్ బాస్ కారణంగా సినిమా అవకాశాలు పెరగడంతో పాటు రియాలిటీ షోలకి కూడా పిలుస్తున్నారు.అలాగే విన్నర్ అభిజిత్ కూడా హీరోగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక టాప్ 5లో ఒకరుగా నిలిచినా సోహైల్ కి హీరోగా అవకాశాలు వస్తున్నాయి.హీరోయిన్ అవ్వాలని కలలు కంటున్న దివికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీదనే తన వేదాళం రీమేక్ లో అవకాశం ఇచ్చారు.

అలాగే హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాలలో ఛాన్స్ లు వచ్చినట్లు తెలుస్తుంది.ఇక మెహబూబాకి కూడా చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో అవకాశం ఇప్పించినట్లు బోగట్టా.

ఇదిలా ఉంటే దేత్తడి వీడియోలతో పాపులర్ అయినా హారికా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు వస్తున్నాయి.తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీకారం సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.

#BiggBoss #PriyankaArul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు