హెలికాప్టర్ లో గంగవ్వ.. వైరల్ వీడియో?

గంగవ్వ ఈ పేరు తెలియని వారే ఉండరు.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు గంగవ్వ అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

 Bigg Boss Fame Gangavva Rides In Helicopter Fans Feels Great Bigg Boss, Gangavva-TeluguStop.com

చిన్న పల్లెటూరులో నివసిస్తూ పొలాలు, పశువులు తప్ప ఏమీ తెలియని గంగవ్వ ఉన్నఫలంగా రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది.మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు తెలిసిన తన పల్లె జీవనాన్ని యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తూ వారి అభిమానాన్ని పొందింది.

ఆ విధంగా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న గంగవ్వ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయింది.

యూట్యూబ్ స్టార్ గా పేరు సంపాదించుకుని 60 ఏళ్ళ వయసులో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పవచ్చు.

ఈ షోలో తన పంచ్ లతో, తన అమాయకపు మాటలతో అందరినీ ఆకట్టుకుంది.అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చారు.

అయితే బిగ్ బాస్ ద్వారా ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది.

బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే గంగవ్వ పలు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేసింది.ఈ విధంగా సంపాదించిన డబ్బును తన సొంత ఊరిలో దాదాపు 20 లక్షల ఖర్చు పెట్టి అందమైన ఇంటిని నిర్మించుకుంది.తాజాగా గంగవ్వ హెలికాప్టర్ ఎక్కి తన ఊరి పొలాలను ఇల్లు పరిసర ప్రాంతాలను హెలికాప్టర్ నుండి చూస్తూ ఎంతో ఆశ్చర్యానికి గురైంది.

ఈ విధంగా మొదటిసారిగా హెలికాఫ్టర్ ఎక్కిన గంగవ్వ తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.ఇంస్టాగ్రామ్ లో హెలికాప్టర్ లో ఉన్న గంగవ్వను చూసిన పలువురు నెటిజన్లు నువ్వు చాలా గ్రేట్ అవ్వ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నేలపై నడిచే గంగవ్వ ఈ విధంగా ఆకాశానికి ఎగరడం ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించిందని నెటిజన్లు భావిస్తున్నారు.గంగవ్వ తన జీవితంలో తాను అనుకున్నవన్నీ లభించాలని కొందరు నెటిజన్లు ఆకాంక్షించారు.

ప్రస్తుతం గంగవ్వ హెలికాప్టర్ ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని నెటిజన్లను ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube