బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ మూవీలో చాన్స్..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు వరుసగా సినిమా, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి.ఇప్పటికే సోహెల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా తాజాగా సోహెల్ హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 Bigg Boss Fame Diwi Got Offer In Pawan Kalyan Film-TeluguStop.com

అభిజిత్, మెహబూబ్, అఖిల్ లకు కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.బిగ్ బాస్ షో కంటెస్టెంట్లలో ఒకరైన సొట్ట బుగ్గల సుందరి దివి వైద్యకు పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

 Bigg Boss Fame Diwi Got Offer In Pawan Kalyan Film-బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ మూవీలో చాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో దివి కొన్ని వారాలే ఉన్నా మాట తీరు, ప్రవర్తనతో ప్రేక్షకులకు దగ్గరైంది.ఇప్పటికే దివి చేతిలో కొన్ని ఆఫర్లు ఉండగా తాజాగా పవన్ సినిమాలో చాన్స్ దక్కినట్లు సమాచారం.

బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రను దివికి ఆఫర్ చేశారు.మెగా బ్రదర్స్ సినిమాల్లో నటిస్తే మాత్రం దివి కెరీర్ పుంజుకునే అవకాశం ఉంది.

పవన్, రానా ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బిగ్ బాస్ షో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లకు ప్లస్ కాకపోయినా ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లకు ప్లస్ అవుతూ ఉండటం గమనార్హం.

గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 4లో పెద్దగా గుర్తింపు లేని కంటెస్టెంట్లు పాల్గొన్నారు.అయితే బిగ్ బాస్ షో ఆ కంటెస్టెంట్లకు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపుతో పాటు పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణమైంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్లు నటిస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు హిట్టైతే మాత్రం వీరికి మరిన్ని చాన్సులు రావడంతో పాటు వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

#Bigg Boss Diwi #Chiranjeevi #Role #Vedalam Ramake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు