అవినాష్ తమ్ముడి కాలర్ పట్టుకున్న అరియానా.. ఎందుకంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొని అవినాష్ అరియానా జోడీ పాపులారిటీని పెంచుకుంది.ఆ పాపులారిటీ వల్లే స్టార్ మా ఛానల్ కూడా ఈవెంట్లలో ఈ జోడీకి ప్రాధాన్యత ఇస్తోంది.

 Bigg Boss Fame Ariyana Shows Her Temper Over Avinash Brother,latest Tollywood Ne-TeluguStop.com

స్టార్ మా ఛానెల్ కామెడీ స్టార్స్ అనే షోను ప్రసారం చేస్తుండగా ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది.ఈ ప్రోమోలో అవినాష్ స్కిట్ లో అరియానా తన విశ్వరూపం చూపించింది.

ఈ షోకు వర్షిణి యాంకర్ గా ఉండగా శేఖర్ మాస్టర్, శ్రీదేవి జడ్జీలుగా ఉన్నారు.

స్కిట్ లో అరియానా, అవినాష్ భార్యాభర్తలుగా నటించారు.

అరియానా అవినాష్ తో వంట చేసుకొని వస్తానని చెప్పి వెళుతుండగా అవినాష్ కింద పడిపోతున్నట్టు నటిస్తూ అరియానా అని పిలుస్తాడు.ఎవరైనా కింద పడితే అమ్మా అని పిలుస్తారని నువ్వేంటి అరియానా అని పిలుస్తున్నావని అరియానా అవినాష్ ను అడగగా చిన్నప్పుడు పుట్టగానే అందరూ అమ్మా అని పిలుస్తారని తాను మాత్రం అరియానా అని పిలిచినని అవినాష్ చెబుతాడు.

ఆ తరువాత అవినాష్ తమ్ముడు ప్లేట్ పట్టుకుని అమ్మా అన్నం పెట్టుకుంటా అని అరియానాతో అనగా అమ్మ ఎవర్రా నీకు.? అంటూ అరియానా అవినాష్ తమ్ముని కాలర్ పట్టుకుని విశ్వరూపం చూపించింది.అడ్డగాడిదలా పెరిగావ్.? నీకు నేను అమ్మేంటి.? అంటూ నవ్వులపువ్వులు పూయించింది.ఆ తరువాత నువ్వు తిండి కడుపుకు పోతుందా.? లేక ముక్కుకు పోతుందా.? అని అరియానా అవినాష్ ను అడుగుతోంది.

మరోవైపు కామెడీ స్టార్స్ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకు గట్టి పోటీ ఇస్తోంది.టీఆర్పీ రేటింగ్ ల విషయంలో కామెడీ స్టార్స్ జబర్దస్త్ షోను బీట్ చేయడం గమనార్హం.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు స్టార్ మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ షోలో ప్రసారమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube