అవినాష్ కు ప్రపోజ్ చేసిన అరియానా.. డైమండ్ రింగ్ తో..?

బుల్లితెరపై రీల్ జోడీలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సెలబ్రిటీలలో అరియానా అవినాష్ జోడీ ఒకటి.బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అరియానా ఎంట్రీ ఇవ్వగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అవినాష్ ఎంట్రీ ఇచ్చారు.

 Bigg Boss Fame Ariyana Make Love Proposal To Avinash-TeluguStop.com

ఈ జోడీ బిగ్ బాస్ హౌస్లో చేసిన సందడి అంతాఇంతా కాదు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా షోలలో, ఈవెంట్లలో ఈ బిగ్ బాస్ జోడీ తెగ సందడి చేస్తోంది.

తాజాగా యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న స్మార్ట్ మ్యూజిక్ షోకు అరియానా, అవినాష్ జంట హాజరు కాగా షోలో ఈ జంట చేసిన అల్లరి అంతాఇంతా కాదు.షోలో అరియానా డైమండ్ రింగ్ పట్టుకొని ఐ విల్ టెల్ యు సమ్ థింగ్ అని అవినాష్ కు చెప్పారు.

 Bigg Boss Fame Ariyana Make Love Proposal To Avinash-అవినాష్ కు ప్రపోజ్ చేసిన అరియానా.. డైమండ్ రింగ్ తో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆమె అవినాష్ కు ఏం చెప్పారో తెలియాలంటే మాత్రం ఆదివారం మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.షోలో ఒకరిపై మరొకరు ప్రేమను కురిపించుకున్నారు.

రీల్ జోడీ అయిన ఈ జోడీ భవిష్యత్తులో రియల్ జోడీ కూడా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సందర్భాల్లో అరియానాను అవినాష్ సపోర్ట్ చేయగా అరియానా కూడా అవినాష్ తో స్నేహంగా మెలిగారు.కామెడీ స్టార్స్ అనే పేరుతో స్టార్ మా ఛానెల్ లో అవినాష్ చేస్తున్న స్కిట్ లో అరియానా కూడా కొన్నిసార్లు కనిపించి సందడి చేస్తున్నారు.

మరోవైపు అరియానాకు హీరోయిన్ ఆఫర్లతో పాటు గెస్ట్ రోల్స్ కూడా వస్తున్నాయని తెలుస్తోంది.

అయితే ఆఫర్లు వస్తున్నా అరియానాకు రెమ్యునరేషన్ మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదని.అరియానా శ్రమకు తగ్గ ఫలితం లేదని తెలుస్తోంది.

#Bigg Boss Show #BiggBoss #Avinash #BiggBoss #AriyanaProposes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు