పాపం.. బిగ్ బాస్ బ్యూటీని పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అని అంటున్నారట?

ఇటీవల కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కత్తి మహేష్‌కి. సినీ విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

 Bigg Boss Fame Anchor Lahari Shari About Pawan Kalyan And Kathi Mahesh-TeluguStop.com

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఈయన చేసిన కామెంట్స్ అనేక సార్లు… చాలా గొడవలకు కారణం అయ్యాయి.అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శించినా కత్తి మహేష్ సమర్ధవంతంగా ఎదుర్కోవడం నిజంగా మెచ్చుకోదగిన విషయం.

అయితే అప్పట్లో ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో కత్తి మహేష్ షో నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం వైరల్ గా మారింది.కారణం తన ప్రశ్నలతో కత్తి మహేశ్ కు గట్టి ఝలక్ ఇచ్చిన ఓ యాంకర్.

 Bigg Boss Fame Anchor Lahari Shari About Pawan Kalyan And Kathi Mahesh-పాపం.. బిగ్ బాస్ బ్యూటీని పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అని అంటున్నారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పటికే.పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ని… మీ తల్లిగారి పేరేంటి? అని అడిగింది.అదే డిబేట్‌లో పాల్గొన్న వివేక్ అనే వ్యక్తి కూడా కత్తి మహేష్‌ని అతని తల్లి గురించి అడిగి ఇబ్బంది పెట్టారు ఆ యాంకర్.

ఎన్నిసార్లు అడిగినా కత్తి మహేష్ తన తల్లి గురించి చెప్పకపోగా.

ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు.అప్పట్లో ఈ ఇంటర్వ్యూ పెద్ద సంచలనమే సృష్టించింది.

ఇంతకీ ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఎవరనుకుంటున్నారు …?? ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ అయిన లహరి.ఆ ఒక్క ఇంటర్వ్యూ ఈమెను సడెన్ గా ఓ సెలబ్రిటీని చేసేసింది.పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆమెకు ప్రశంసలతో ముంచెత్తారు.ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కవరేజ్‌కి వెళ్లడం.బైక్‌పై జనసేన జెండా పెట్టుకుని చక్కర్లు కొట్టడం.ఆయనతో పర్సనల్‌గా కలిసి ఫొటోలు దిగడంపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది.

వీటన్నింటిపైన స్పందిస్తూ లహరి పోస్ట్ చేసిన.ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ లహరి ఏం చెప్పిందంటే.‘నిజానికి కత్తి మహేష్ వల్లే నేను ఫేమ్ అయ్యానని….ఆయన ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడటం.దాన్ని ఖండించడంతో ఎక్కడ చూసినా ఆ ఇంటర్వ్యూ బాగా పాపులర్ అయ్యిందని ఆమె అన్నారు.

నిజానికి కత్తి మహేష్ గారితో తనకు ఎలాంటి గొడవలు లేవని పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేస్తుంటే చూడలేక ఒక అభిమానిగా ఆయన మాటలను ఖండించానని లహరి తెలిపారు.ఆరోజు కత్తి మహేష్ గారు ఆ ఇంటర్వ్యూ మధ్యలో అలా లేచి వెళ్తారని కానీ.

అది పెద్ద వైరల్ అవుతుందని కానీ తాను అస్సలు ఊహించలేదని ఆమె వివరణ ఇచ్చారు.

అంతే కాకుండా.ఆ ఇంటర్వ్యూలో తాను కత్తి మహేష్ తల్లి గురించి అడగడాన్ని చాలామంది తప్పు పట్టారని… తనకైతే అందులో తప్పు ఉందని అనిపించలేదని లహరి చెప్పారు.ఆ ప్రశ్న వేసినందుకు ఆయన లేచి వెళ్లపోవడం కరెక్ట్ కాదేమోననిపించిందని.

ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ గారు కూడా మీ తల్లి పేరు ఏంటి ఆవిడ ఏం చేస్తారని మాత్రమే అడిగారని ఆమె అన్నారు.అప్పటికీ కత్తి మహేష్ గారిని అలా వెళ్లిపోవద్దని చాలా రిక్వెస్ట్ చేశానని లహరి వెల్లడించారు.

కత్తి మహేష్ తల్లిని కించపరచాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని ఆమె అన్నారు.

ఈ ఇష్యూలో తర్వాత తనపై చాలా నెగిటివ్‌గా కామెంట్స్ చేశారని… పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అని తప్పుడు ప్రచారం కూడా చేశారని లహరి వాపోయారు.తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని.ఆ రూమర్ ఎందుకు వచ్చిందంటే.

పవన్ కళ్యాణ్ అంటే అభిమానం.అభిమానం.

అని ఓ పది మంది దగ్గర చెప్పేసరికి అది జనంలోకి వేరే విధంగా వెళ్లిందని ఆమె అన్నారు.తాను పవన్ కళ్యాణ్‌కి ప్రేమలేఖలు ఏం రాయలేదని… తాను నేషనల్ మీడియా ఛానల్స్‌లో పవన్ కళ్యాణ్ తరుపున మాట్లాడటం చాలామందికి నచ్చలేదని ఆమె చెప్పారు.

పైగా నేను రియాక్ట్ అవుతానని అనుకున్నారు.నాకు అంత అవసరం లేదు.

అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడ? తానెక్కడ ?? తాను ఓ మీడియా ప్రతినిధిగా మాత్రమే.నాలుగు రోజులు జనసేన పార్టీ కవరేజ్‌కి వెళ్లానని లహరి తెలిపారు.

ఆ కవరేజ్‌కి తాను ఎందుకు వెళ్లానంటే.ఒక అభిమానిగా ఆయన్ని చూడొచ్చనే వెళ్లానని ఆమె అన్నారు.ఇది పచ్చినిజం అని.కవరేజ్‌కి వెళ్లినప్పుడు చాలామంది జర్నలిస్ట్‌లు ఉన్నప్పటికీ తాను ముందు ఉన్నందువల్లే… పవన్ కళ్యాణ్ తనతోనే మాట్లాడారు… అంతే తప్ప మరోటి లేదు’ అంటూ తనపై వచ్చిన రూమర్లను నిక్కచ్చిగా ఖండించారు యాంకర్ లహరి.

#Kathi Mahesh #Janasena #Lahari Shari #Big Boss Anchor #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు