Manas : ఘనంగా మొదలైన బిగ్ బాస్ మానస్ పెళ్లి వేడుకలు… వీడియో వైరల్!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎంతోమందితో వివాహ బంధంతో ఒకటవుతున్నారు.ఇక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు అలాగే బుల్లితెర నటీనటులుకూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

 Bigg Boss Fame Actor Manas Marriage Video Viral On Social Media-TeluguStop.com

ఈ క్రమంలోనే బుల్లితెర నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బిగ్ బాస్ (Bigg Boss) మానస్ ( Manas ) కూడా పెళ్లి చేసుకోతున్నారు.గత రెండు నెలల క్రితం మానస్ శ్రీజ( Sreeja ) అనే అమ్మాయిని ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక కొద్దిరోజులుగా మానస్ తన పెళ్లి పనులలో బిజీ అయిన విషయం మనకు తెలిసిందే.ఇక తాజాగా నేడు ఈయన పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది.ఇప్పటికే హాల్దికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలను మానస్ ,తన తల్లి కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో మానస్ వివాహం జరగబోతుంది అని తెలుస్తుంది.

ఇక మానస్ పలు బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన వెబ్ సిరీస్లలో నటించే అవకాశాలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం స్టార్ మాతో పాటు జీ తెలుగులో కూడా సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇక మానస్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నారు.

ఇక ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున బుల్లి తెర నటీనటులు హాజరు కాబోతున్నారు.ప్రస్తుతం మానస్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇప్పటికే మానస్ ను పెళ్ళికొడుకుని చేసారని అనంతరం తన కొడుకును ఎంతో అందంగా అలంకరించి తన తల్లి పద్మిని( Padmini ) ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇక మానస్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలియడంతో ఎంతో మంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube