ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న బిగ్ బాస్ నెమ్మదిగా చివరి దశకు చేరుకుంటుంది.షో ఎండింగ్ కు దగ్గరయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.
బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో కంటెస్టెంటుగా అడుగు పెట్టిన జెస్సీ.చక్కటి ఆటతీరు కనబర్చాడు.
అయితే అనూహ్య రీతిలో ఆయన హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.అనారోగ్య కారణాలతో ఈ మోడల్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
నిజానికి ఆయన ఇంకా ఆటలో కొనసాగుతాడు అనుకున్నారు చాలా మంది.అయితే తన అనారోగ్యం కారణంగా బయటకు రాక తప్పలేదు.
సీక్రెట్ రూమ్ లో ఉన్న తనను మళ్లీ హౌస్ లోకి తీసుకుంటారేమో అని తను భావించాడు.కానీ తన ఆశ నిరాశే అయ్యింది.
అటు షో నుంచి బయటకు వెళ్లిన జెస్సీ.తోటి కంటెస్టెంట్లకు చాలా విషయాలు చెప్పాడు.ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడాడు.ఒక్కరు షోలో ఎలా ఉన్నారు? ఇక ముందు ఎలా ఉండాలి? అనే విషయాలను వెల్లడించాడు.అందరితో పర్సనల్ గా మాట్లాడి.వారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.ఈ సందర్భంగా అందరికీ మంచి సలహాలు ఇచ్చాడు.
మరోవైపు సుమారు 10 వారాల పాటు ఆయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు.అయితే ఈ పీరియడ్ లో తనకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే జెస్సీకి వారానికి రూ.1.58 లక్షల పారితోషయాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఆయనకు 10 నుంచి 11 లక్షల వరకు జెస్సీ అందుకున్నట్లు తెలుస్తోంది.మిగతా హౌస్ మేట్స్ తో పోల్చితే జెస్సీకి ఇచ్చింది చాలా తక్కువే అనే టాక్ నడుస్తుంది.జెస్సీ టైటిల్ గెలవకపోయినా.అందరి మనసులు మాత్రం గెలిచాడు.
అనారోగ్యం ఆయనను హౌస్ లో కొనసాగకుండా చేయడం పట్ల చాలా మంది బాధపడుతున్నారు.ఆయన వీలైనంత త్వరగా ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుంటున్నారు జనాలు.