సిక్స్ ప్యాక్ కు ట్రై చేస్తున్న బిగ్ బాస్ దివి.. వైరల్ ఫోటోస్?

ఈమధ్య ఫిమేల్ సెలబ్రిటీస్ కూడా వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ ను సొంతం చేసుకుంటున్నారు.ముఖ్యంగా సిక్స్ ప్యాక్ కోసం అమ్మాయిలు బాగా ప్రయత్నిస్తున్నారు.

 Bigg Boss Divi Trying To Get Six Pack Viral Photos , Bigg Boss , Divi , Get Six-TeluguStop.com

ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత గతంలో తన సిక్స్ ప్యాక్ తో అందరికి షాక్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలు కూడా సమంతను ఫాలో అవుతున్నారు.

తనలాగా మంచి ఫిజిక్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.అందులో ఒకరు దివి కూడా సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది.

బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా పరిచయమైన బ్యూటీ దివి.సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దివి తన అందంతో యువత మనసులు దోచుకుంది.

అలా ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

బిగ్ బాస్ ముందు దివి వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగు పెట్టింది.

మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.ఆ సమయంలో ఆమె అంతగా పరిచయం లేని నటి.కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.

తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.

ఆమధ్య మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక గత ఏడాది చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో నటించింది.

కానీ తన నటనకు మాత్రం అంతగా మార్కులు రాలేవు.ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.

ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక ఈమధ్య బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ సొంతం చేసుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తన అందాన్ని చూసి తన ఫాలోవర్స్ ఫిదా అవ్వగా కొంతమంది మాత్రం తను సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తుంది అని తన బాడీని చూసి చెబుతున్నారు.

బహుశా దివి కూడా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube