బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివి ( Divi ) ఒకరు.ఈమె ఈ కార్యక్రమానికి రాకముందు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.
అయితే తాజాగా ఈమె లంబసింగి ( Lambasingi )సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమా మార్చి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే పనులలో దివి ఉన్నారు.
ఇప్పటికే ఎన్నో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పాటలు కూడా మంచిగా ఆదరణ సొంతం చేసుకున్నాయి.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో దివి రష్మిక( Rashmika ) ను కలిశారు.అంతేకాకుండా తన సినిమాను సపోర్ట్ చేయాలంటూ ఆమెను కోరారు.ఇలా వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి వీడియోని దివి ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
మా లంబసింగి సినిమాని మీరు తప్పకుండా చూడాలని ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ ప్రాజెక్టు చేసామని తెలిపారు.ఈ క్రమంలోనే రష్మిక సైతం లంబసింగి సినిమా గురించి చెబుతూ మార్చి 15వ తేదీ రాబోతుందని తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేసారు.దీంతో ఈ వీడియోని కాస్త దీవి షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఈమె రష్మికకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.థాంక్యూ బ్యూటిఫుల్ రష్మిక మందన్న.నువ్వు లోపల, బయట కూడా బ్యూటిఫుల్.
నీ నేచర్ బాగా నచ్చేసిందే ఓ పిల్లా అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం దివి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.