Divi: మట్టిపని చేస్తున్న బిగ్ బాస్ దివి.. నీ అసలు గెటప్ ఇదే కదా అంటూ ట్రోల్స్?

అప్పుడప్పుడు సెలబ్రెటీలు షో చేయటం కోసం కొన్ని వీడియోస్ చేయించుకుంటూ ఉంటారు.ప్రత్యేకంగా వాటికి తగ్గ లుక్కులలో కనిపిస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు.

ఇక ఈమధ్య చాలామంది సెలబ్రిటీలు ఫోటోషూట్, వీడియోస్ చేయించుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్తున్నారు.ఏ పనినైనా చేస్తున్నారు.

ఏ గెటప్ లోనైనా కనిపిస్తున్నారు.ఎందుకంటే తమ టాలెంట్ ను జనాలలో చూపించాలి కాబట్టి.

అయితే తాజాగా బిగ్ బాస్ దివి(Divi) కూడా మట్టి పని చేస్తూ కనిపించింది.దీంతో వెంటనే ఆమెను టార్గెట్ చేసి కొందరు బాగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఇంతకు అసలు ఏం జరిగిందో చూద్దాం.రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) ద్వారా అందరి దృష్టిలో పడింది దివి.

అంతకుముందే వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈమె అంతగా గుర్తింపు ఉన్నట్టుగా పరిచయం కాలేదు.కానీ ఎప్పుడైతే బిగ్బాస్ లో అడుగుపెట్టిందో ఇక అప్పటినుంచి తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.

బిగ్బాస్ లో అడుగుపెట్టిన మొదట్లో ఈమె ఎవరు అని బుల్లితెర ప్రేక్షకులు బాగా ఆరా తీశారు.

కారణం ఏంటంటే తన తొలి చూపులతోనే అందర్నీ ఆకట్టుకుంది కాబట్టి.అందుకే అందరూ ఆమె గురించి ఆ సమయంలో బాగా వెతుకులాడగా మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది అని తెలుసుకున్నారు.ఇక హౌస్ లో ఉన్నంతకాలం ఈమె ఆట తీరుకు, మాట తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

Advertisement

సోషల్ మీడియాలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు కూడా బాగా వచ్చాయి.కొన్ని ఆల్బమ్స్ లో కూడా చేసింది.

చిరంజీవి సినిమాలో కూడా అవకాశం అందుకుంది.కానీ నటన పరంగ మెప్పించలేకపోయింది.

ఇక ఈ మధ్యనే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో(Special song) కూడా అవకాశం అందుకుంది.

ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేయకుండా ఉండదు.ముఖ్యంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బాగా చూపిస్తుంది.

దీంతో ఈమెకు నెగటివ్ కామెంట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి.కారణం ఏంటంటే మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన ఈమె.ఇప్పుడు ఈ విధంగా తెగించటంతో బాగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.అయితే తాజాగా పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించింది.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది.అందులో తను వేరుశెనగలు తీయడం కోసం మట్టి తవ్వుతూ కనిపించింది.

అంతేకాకుండా మేకను పట్టుకొని దాని చెవిని కొరుకుతూ.పిల్లలతో ఆడుతూ సరదాగా కనిపించింది.

అయితే అందులో ఆమె గెటప్ చూస్తే ఈమెనా గ్లామర్ షో చేసేది అన్నట్లుగా అనిపించింది.అయితే ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.

అందులో తన లుక్ చూసి ఇదే కదా నీ అసలు రూపం అంటూ ట్రోల్ చేస్తున్నారు.

తాజా వార్తలు