అయ్యో దివి పాప.. మొదటి ప్లాప్ మూట కట్టుకుంది

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న దివి ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.ప్రస్తుతం ఈమె రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తుంది.

 Bigg Boss Divi Cab Story Movie Talk , Bigg Boss Divi,  Cab Storys , Divi Film Ne-TeluguStop.com

చిరంజీవి వేదాళం సినిమా లో ఈమెకు కీలక పాత్ర ను ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే మెహర్ రమేష్ ప్రకటించాడు.ఒక వైపు ఆఫర్లు వస్తున్నాయి.

మరో వైపు ఈమె నటించిన సినిమాలు వస్తున్నాయి.ఈ సమయంలో దివికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

స్పార్క్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్యాబ్‌ స్టోరీస్‌ సినిమా నిరాశ పర్చింది.ఈ సినిమా చాలా రోజులుగా దివి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.

కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది.తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు.

కాని అనూహ్యంగా ఈ సినిమా నిరాశ పర్చడంతో పాటు దివికి చెడ్డ పేరు తీసుకు వచ్చింది.ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతాయని అనుకుంటే మరీ దారునంగా విమర్శలు వస్తున్నాయి.

వేదాళం సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అయ్యేట్లు లేదు.ఈ లోపు పలు సినిమా లు మరియు వెబ్‌ సిరీస్ ల్లో నటించిన దివి వరుసగా ఇలా నిరాశ పర్చితే పరిస్థితి ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బిగ్ బాస్ లో ఉన్న సమయంలో దివి మంచి గుర్తింపును దక్కించుకుంది.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.కాని ఆమె మాత్రం చాలా తక్కువ సినిమాలకు ఓకే చెప్పింది.కొన్ని వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా బిజీ అవ్వాలనుకున్న దివికి మొదటి దెబ్బ తలిగింది.

వరుసగా సినిమాలతో రెచ్చి పోదాం అనుకున్న అమ్మడు కాస్త నిరాశకు గురయ్యింది.క్యాబ్‌ స్టోరీస్ సినిమా నిరాశకు గురి చేయడంతో పాటు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

దివి తో పాటు ఇతరులు ఎవరు కూడా ఈ సినిమా లో ఆకట్టుకోలేదు అనే విమర్శలు వస్తున్నాయి.పెద్ద ఎత్తున ఈ సినిమా పై అంచనాలున్న కారణమో లేక ఏంటో కాని సినిమా నిరాశ పర్చింది.

అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube