బిగ్ బాస్ హారిక అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసిందా….?  

Dethadi Harika Left Amazon Job, Dethadi harika, bigg Boss4, Dethadi Harika Personal Life, Winner Race, Nominations - Telugu Alekya Harika, Bigg Boss, Bigg Boss4, Dethadi, Dethadi Harika, Dethadi Harika Left Amazon Job, Dethadi Harika Personal Life, Harika, Nominations, Winner Race

బిగ్ బాస్ వీక్షకులకు దేత్తడి హారిక కొత్తేమో కానీ యూట్యూబ్ వీక్షకులకు హారిక ఎంతో సుపరిచితం.తెలంగాణ యాసలో హారిక చేసిన వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

TeluguStop.com - Bigg Boss Dethadi Harika Personal Life Job

హారిక యూట్యూబ్ ఛానల్ కు లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 3 టైం లోనే బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల జాబితాలో హారిక పేరు వినిపించినా అప్పుడు ఆమె ఎందుకో ఎంపిక కాలేదు.

దేత్తడి ఛానల్ ద్వారా ప్రజలకు సుపరిచితమైన హారికది హైదరాబాద్.

TeluguStop.com - బిగ్ బాస్ హారిక అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసిందా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న హారిక నటన కోసం ప్రముఖ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేయడం గమనార్హం.

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ లో మంచి పొజిషన్ లో హారికకు ఉద్యోగం వచ్చింది.కొన్ని నెలలు ఉద్యోగం చేసిన అనంతరం హారిక నటనపై ఉన్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయం యూట్యూబ్ కే కేటాయించి కెరీర్ లో సక్సెస్ అయింది.

హారిక పలు షార్ట్ ఫిల్మ్ లలోనూ నటించింది.

డ్యాన్స్ పై ఎంతో ఇష్టం ఉన్న హారిక భవిష్యత్తులో కొరియోగ్రాఫర్ కావాలని అనుకుంటోంది.

ఈమెకు పలు సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చినా వేర్వేరు కారణాల వల్ల అందుకు అంగీకరించలేదని సమాచారం.తన వీడియోల ద్వారా నవ్వించడంతో పాటు సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది హారిక.

మరోవైపు బిగ్ బాస్ షోలో సైతం తన అభినయంతో హారిక అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.

హారిక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అవుతుందో లేదో చెప్పలేం కానీ విన్నర్ రేసులో గట్టి పోటీ ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు.

ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన హారికకు బాగానే ఓట్లు వస్తున్నాయని తెలుస్తోంది.యూట్యూబ్ వీడియోలలో పద్ధతిగా కనిపించిన హారిక బిగ్ బాస్ షోలో గ్లామర్ షోకు ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం.

అయితే అన్ని పాజిటివ్ లు ఉన్నప్పటికీ హారిక కుటుంబ సభ్యులు ఓట్ల కోసం హారిక గతంలో చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారని… ఓట్ల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయవద్దని నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

#Nominations #Harika #Alekya Harika #DethadiHarika #Dethadi Harika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Dethadi Harika Personal Life Job Related Telugu News,Photos/Pics,Images..