ఆ కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఇవ్వని బిగ్ బాస్..?  

bigg boss contestants remuneration rules and regulations, Bigg boss4, Remuneration, gangavva, jordar sujatha, bigg boss contestants - Telugu Bigg Boss 4, Bigg Boss Contestants, Bigg Boss Contestants Remuneration Rules And Regulations, Bigg Boss Remunerations, Bigg Boss Rules, Bigg Boss4, Gangavva, Jordar Sujatha, Remuneration

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు ఇంకా రెమ్యునరేషన్లు అందలేదా.? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.అందరు కంటెస్టెంట్లకు కాదు కానీ గంగవ్వ, జోర్దార్ సుజాతలకు మాత్రం ఇప్పటివరకు రెమ్యునరేషన్ అందలేదని కాంట్రాక్ట్ లో ఉన్న నిబంధనలే ఇందుకు కారణమని సమాచారం.వాస్తవానికి గంగవ్వ ఇల్లు కట్టుకోవాలనే కోరిక వల్ల బిగ్ బాస్ హౌస్ కు వచ్చింది.
అయితే బిగ్ బాస్ హౌస్ వాతావరణం పడకపోవటం, అనారోగ్య సమస్యల వల్ల గంగవ్వ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది.గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే చివరి వారం వరకు ఉండేదని చాలామంది భావిస్తున్నారు.

TeluguStop.com - Bigg Boss Contestants Remuneration Rules And Regulations

అయితే గంగవ్వ ఇల్లు కట్టుకోవాలనే కోరికను మాత్రం నాగార్జున నెరవేరుస్తానని బిగ్ బాస్ వేదికగా హామీ ఇచ్చాడు.దీంతో గంగవ్వకు రెమ్యునరేషన్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ షో పూర్తైన తరువాత గంగవ్వ ఇంటి పనులు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే జోర్దార్ సుజాతకు ఎలిమినేట్ అయిన 15 రోజుల తర్వాత రెమ్యునరేషన్ ఇస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని.

TeluguStop.com - ఆ కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఇవ్వని బిగ్ బాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ ప్రకారమే చెల్లించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.కొందరు కంటెస్టెంట్లకు రోజుల లెక్కన పారితోషికం చెల్లిస్తే మరికొందరు సెలబ్రిటీలకు మాత్రం వారాల లెక్కల ప్రకారం పారితోషికం చెల్లించనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు గతంలో కంటెస్టంట్ల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయగా ప్రస్తుతం చెక్కుల రూపంలో పేమెంట్లు ఇస్తున్నారని సమాచారం. దసరా పండుగ వల్ల జోర్దార్ సుజాతకు చెక్కు అందడంలో ఆలస్యం జరగగా గంగవ్వకు ఏ విధంగా అందజేస్తారో తెలియాల్సి ఉంది.

గంగవ్వ తనకు సొంతూరైన లంబాడీపల్లెలోనే ఇల్లు కావాలని.మరోచోట ఇల్లు కట్టించినా ప్రయోజనం ఉండదని చెబుతోంది.

#Remuneration #BiggBoss #BiggBoss #Jordar Sujatha #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Contestants Remuneration Rules And Regulations Related Telugu News,Photos/Pics,Images..