అతడితో నాకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది... పెళ్లి కాలేదంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్....  

మామూలుగా ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. అంతేగాక ఒక్కోసారి ఈ ప్రేమకి వయసు, పేద, ధనిక అనే భేదాలు కూడా ఉండవు.

TeluguStop.com - Bigg Boss Contestants Pavitra And Paras Love Story Breakup

తాజాగా హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో 14వ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బాలీవుడ్ నటి  పవిత్ర పూనియా ప్రేమాయణం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లోని పలు సీరియల్ ద్వారా పాపులర్ అయినటువంటి ప్రముఖ నటి పవిత్ర పూనియా ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటోంది.

TeluguStop.com - అతడితో నాకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది… పెళ్లి కాలేదంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో ప్రేమలో పడింది. దాంతో ఇటీవలే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే పవిత్ర పూనియా తనతో పాటూ బిగ్ బాస్  షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న కంటెస్టెంట్ పరాస్  తో మళ్ళీ ప్రేమలో పడింది.దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకుతూ చివరికి పవిత్ర పూనియాభర్త చెవిన పడింది.

Telugu Bigg Boss Contestants, Bigg Boss Contestants Pavitra And Paras Love Story Breakup, Bigg Boss Contestants14th Season, Bollywood, Love Breakup, Paras, Pavitra-Movie

అయితే ఈ విషయంపై పవిత్ర పూనియా ని తన  భర్త నిలదీయగా తానూ ఎవరితో ప్రేమలో పడలేదంటూ వారించడానికి యత్నించింది.  దీంతో పవిత్ర పూనియా భర్త పరాస్ కి ఫోన్ చేసి తమ పెళ్లి విషయం చెప్పడంతో పరాస్ పవిత్ర పూనియా కి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం.చివరికి పవిత్ర పూనియా కేవలం తనకి సుమిత్ కి నిశ్చితార్థం మాత్రమే జరిగిందని తనకి పెళ్లి కాలేదని ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూ లో తెలిపింది.దీంతో పవిత్ర పూనియా లవ్ స్టోరీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

 ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పవిత్ర పూనియాహిందీలో లవ్ యు జిందగీ, గంగ, నాగిని3,  తదితర సీరియళ్లలో నటించి బాగానే పాపులర్ అయ్యింది.

అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఇటువంటి  థ్రిల్లర్ తరహా చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Pavitra #BiggBoss #Paras #BiggBoss #Love Breakup

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు