వైరల్ వీడియో: డాన్సులతో అదరకొడుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

సోదరా.అప్పటి వరకు ఈ పదం కేవలం అలనాటి పౌరాణిక సినిమాల్లో ఎక్కువగా వింటుండేవాళ్ళం.

 Bigg Boss Contestants Energetic Dance Video Viral-TeluguStop.com

కానీ ప్రస్తుతం సోదరా అనే పదం యూత్ బాగా కనెక్ట్ అయిపోయింది.ముఖ్యంగా సోదరా అనగానే గుర్తుకువచ్చేది తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కుమార్ సాయి గుర్తుకువస్తాడు.

హౌస్‏లో అడుగు పెట్టిన మొదట్లో ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటూ వచ్చాడు కుమార్ సాయి.ఆ తర్వాత తన ఆటలో మార్పు తీసుకువస్తూ.

 Bigg Boss Contestants Energetic Dance Video Viral-వైరల్ వీడియో: డాన్సులతో అదరకొడుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందరిని సోదరా అంటూ పిలుస్తూ.నిజాయితిగా గేమ్ ఆడుతూ వచ్చాడు.

కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చాడు.ఇక కుమార్ సాయి ఇంట్లో ఉన్నప్పుడు తను ప్రతిసారి వాడిన సోదరా పదం మాత్రం ఇప్పటీకి యూత్ ఉపయోగిస్తూనే ఉన్నారు.

తాజాగా కుమార్ సాయి.తన తోటి కంటెస్టెంట్‏తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్ నుంచి బయటకు వచ్చాక.పార్టీలు, సెలబ్రెషన్స్ అంటూ ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే కుమార్ సాయి, లాస్య కలిసి నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోని గ్యాంగ్ గ్యాంగ్ అనే పాటకు స్టెప్పులేసారు.ఫుల్ ఎనర్జిటిక్‏తో డ్యాన్స్ చేస్తుండగా.

లాస్య కూడా నేనేం తక్కువ కాదు అన్నట్టుగా అతనితో పోటి పడి మరీ డ్యాన్స్ చేసింది.ఈ వీడియోను లాస్య తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.

సోదరాతో స్టెప్పులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా.త్వరలోనే బిగ్ బాస్ 5 సీజన్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే సీజన్ 5 కోసం మొత్తం 60 మంది కంటెస్టెంట్స్ సెలక్షన్ జరిగిపోయినట్లుగా.మరికొంత మందిని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం.

ఇక వచ్చే బిగ్ బాస్ సీజన్ 5కు నాగార్జున హోస్ట్ గా చేయడని గతంలో వార్తలు వచ్చాయి.మరీ నిజాంగానే నాగార్జున షో నుంచి తప్పుకుంటే.

హోస్ట్ గా మరెవరిని తీసుకువస్తారనేది తెలియాల్సి ఉంది.

#Viral Video #Nagarjuna #Kumar Sai #Social Media #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు