నా కూతురు చెడ్డీలు వేసుకుని తిరిగితే తప్పెంటీ అంటూ హారిక తల్లి ఫైర్...

ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది మన వేషధారణను బట్టి వ్యక్తిత్వాలని ఇట్టే నిర్ణయిస్తుంటారు. కానీ ఇది చాలా తప్పని కొంతమంది ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Bigg Boss Contestants Dethadi Harika Mother Jyothi Serious On Negative Trollars,-TeluguStop.com

 అయితే మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “దేత్తడి హారిక” ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.ఈ గేమ్ షోల్లో పాల్గొన్నప్పటి నుంచి తన ఆట తీరుతో హారిక బాగానే ఆకట్టుకుంటోంది.

అయితే ఈ మధ్య కాలంలో దేత్తడి హారిక వేసుకుంటున్న బట్టలపై కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో నెగెటివ్ గా  ప్రచారం చేస్తున్నారు.దీంతో హారిక తల్లి జ్యోతి ఈ విషయంపై స్పందిస్తూ అబ్బాయిలు  చెడ్డీలు (షార్ట్ లు) వేసుకుని రోడ్లపై తిరిగినప్పుడు ఒక అమ్మాయి కూడా చెడ్డీలు ధరించడంలో తప్పేముందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 అంతేకాక ఇతరులు వేసుకున్నటువంటి బట్టలను బట్టి ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాలను నిర్ణయించకూడదని సూచించింది. అలాగే తన కూతురిపై తనకు నమ్మకం ఉందని అలాగే ఇతరులపై కామెంట్లు చేసేటప్పుడు తమ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటూ ఫైర్ అయ్యింది.

దీంతో హారిక తల్లి జ్యోతి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అంతేగాక మరి కొంత మంది అభిమానులు బట్టలపై జ్యోతి చేసినటువంటి ఈ వ్యాఖ్యలను సమర్పిస్తున్నారు.

 ఆడ పిల్లలంటే కేవలం లంగా ఓణీలు మాత్రమే వేసుకోరని సమయ సందర్భాలను బట్టి వారి దుస్తులను ధరించే హక్కు ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Biggboss, Dethadi Harika, Trollers, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలై 12 వారాలు కావస్తున్నప్పటికీ దేత్తడి హారిక ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ బాగానే ఆడుతోంది.దీంతో దేత్తడి హారిక అభిమానులు కచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఆమె అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube