బిగ్ బాస్ లో ఆ కంటెస్టెంట్ ను కావాలనే బ్యాడ్ చేస్తున్నారా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.చాలామంది ప్రేక్షకులు ఈ షో స్క్రిప్టెడ్ అని అభిప్రాయపడుతుంటారు.

 Bigg Boss Contestant Sohel Sorry To Dethadi Harika, Bigboss Show, Big Boss Winne-TeluguStop.com

ఈ షో ఓటింగ్ విషయంలో కూడా ప్రేక్షకుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.బిగ్ బాస్ నిర్వాహకులు కొంతమందికి ఓట్లు తక్కువగా వచ్చినా వాళ్లను ఎలిమినేట్ చేయకుండా కాపాడుతున్నారని బిగ్ బాస్ ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉంటాయి.

స్క్రీన్ స్పేస్ విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందని కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తరువాత బిగ్ బాస్ నిర్వాహకులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.నామినేషన్ సమయంలో హారిక సొహైల్ మధ్య గొడవను బిగ్ బాస్ హైలెట్ చేసిన సంగతి తెలిసిందే.

హారికపై విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో చాలామంది సొహైల్ ను ట్రోల్ చేశారు.అయితే హారికకు సొహైల్ సారీ చెప్పాడని సారీ చెప్పడం మాత్రం టెలీకాస్ట్ కాలేదని సమాచారం.

Telugu Bigg Boss Show, Bigg Boss, Dethadi Harika, Syed Sohel-Movie

దీంతో బిగ్ బాస్ సొహైల్ ను బయటకు పంపించాలని కుట్ర చేస్తున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో సొహైల్ కూడా ఒకరు.చాలామంది సెలబ్రిటీలు బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో సొహైల్ కూడా అభిప్రాయపడుతున్నారు.సోహెల్ అఖిల్ తో హారికకు సారీ చెప్పానని చెప్పడంతో ఈ విషయం తెలిసిందే.

బిగ్ బాస్ షోలో ఇప్పుడు గమనిస్తే హారిక సొహైల్ లు క్లోజ్ గానే ఉన్నారు.

మరోవైపు ఈ వారం బిగ్ బాస్ షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఎలిమినేషన్ కు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వేయడం కష్టంగా మారుతోంది.మరోవైపు బిగ్ బాస్ విన్నర్ విషయంలో సైతం ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube