ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లా.. దీప్తి షణ్ముఖ్ లవ్ వీక్ కాదు.. సిరి కీలక వ్యాఖ్యలు!

Bigg Boss Contestant Siri Hanmanth Comments About Netizens Trolls

యూట్యూబ్ వీడియోల ద్వారా, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో సిరి హన్మంత్ ఒకరు.ఈ గుర్తింపు ద్వారా బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసిన సిరి హన్మంత్ తన ప్రవర్తన ద్వారా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను మూటగట్టుకున్నారు.

 Bigg Boss Contestant Siri Hanmanth Comments About Netizens Trolls-TeluguStop.com

సిరి హన్మంత్ షణ్ముఖ్ తో ప్రవర్తించిన తీరు వల్లషణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోయారనే కామెంట్లు వినిపించాయి.షణ్ముఖ్ విన్నర్ కాకపోవడానికి సిరి కారణమనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిరి బిగ్ బాస్ హౌస్ లో రవి తనకు బ్రదర్ లా ఉంటే షణ్ముఖ్ జశ్వంత్, జెస్సీ మాత్రం మంచి స్నేహితులలా ఉన్నారని ఆమె తెలిపారు.షణ్ముఖ్ దీప్తి సునైనాల లవ్ వీక్ లవ్ అని తాను భావించడం దీప్తి సునైనా బ్రేకప్ కు సంబంధించిన స్టేటస్ పెట్టిన వెంటనే తనపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయని ఆమె అన్నారు.

 Bigg Boss Contestant Siri Hanmanth Comments About Netizens Trolls-ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లా.. దీప్తి షణ్ముఖ్ లవ్ వీక్ కాదు.. సిరి కీలక వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ షో వల్ల వాళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని తాను అనుకోనని సిరి చెప్పుకొచ్చారు.

బయట ఉండే సమయంలో ఎంతోమంది ఎమోషన్లను మనం చూడగలుగుతామని బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కేవలం 19 మంది ఎమోషన్లను మాత్రమే తాము చూడగలుగుతామని సిరి కామెంట్లు చేశారు.

షణ్ముఖ్ కు, తనకు మధ్య ఎమోషనల్ గా ఫీల్ కావడం కొంచెం ఎక్కువగా జరిగిందని సిరి అన్నారు.దీప్తి సునైనా నాకు మంచి స్నేహితురాలని ఆమెతో కలిసి పని చేశానని సిరి పేర్కొన్నారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత తన గురించి వచ్చిన ట్రోల్స్ ను చూసి డిప్రెషన్ లోకి వెళ్లానని ఆమె కామెంట్లు చేశారు.సిరి హన్మంత్ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Bigg Boss Contestant Siri Hanmanth Comments About Netizens Trolls , Bigboss Contestant , Deepthi Sunaina, Shanmukh, Siri , Bigboss - Telugu Biggboss, Netizens Trolls

#BiggBoss #Netizens Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube