సొంతంగా ఇల్లు కొనుక్కున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి.. ఖరీదెంతంటే?

బుల్లితెర షో బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి కూడా ఒకరు.ప్రస్తుతం జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేష్ తో కలిసి రోహిణి స్కిట్లు చేస్తుండగా ఆ స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 Bigg Boss Contestant Rohini House Video Goes Viral In Social Media Details, One-TeluguStop.com

యాక్టింగ్ టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రోహిణి కథ నచ్చితే సీరియళ్లలో నటించడానికి కూడా సిద్ధమేనని చెబుతుండటం గమనార్హం.

గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రోహిణి తాజాగా సొంతింటి కలను నిజం చేసుకున్నారు.

హైదరాబాద్ లోని ప్రముఖ ఏరియాలలో ఒకటైన మణికొండలో టీవీ షోలు, బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బులతో డూప్లెక్స్ హౌస్ ను కొన్నారు.డూప్లెక్స్ హౌస్ ను కొనుగోలు చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.

సొంత ఇల్లు కొనుక్కోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందని రోహిణి పేర్కొన్నారు.

హోమ్ టూర్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.రోహిణి కొనుగోలు చేసిన ఈ ఇంటి ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.ఫర్నీఛర్ తో సహా ఇంటిని కొనుగోలు చేసినట్టు రోహిణి చెప్పుకొచ్చారు.

త్వరలో ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుతానని రోహిణి వెల్లడించారు.

తనకు ఇష్టమైన మొక్కలను టెర్రస్ పై పెంచుతానని రోహిణి అన్నారు.వీడియోలో హాల్, కిచెన్, గెస్ట్ బెడ్ రూమ్, సిట్టింగ్ ఏరియా, టెర్రస్ ను రోహిణి చూపించారు.జబర్దస్త్ షో ద్వారా రోహిణికి బాగానే ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.

యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రోహిణి బాగానే సంపాదిస్తున్నారని సమాచారం.రోహిణి సినిమాల్లో ప్రయత్నిస్తే ఆమెకు సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube