శివజ్యోతి చిన్నపిల్లాడిలా చూసుకుందంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..  

bigg boss contestant ravi krishna comments about shiva jyothi, ravi krishna, shiva jyothi, star maa channel, dasara event,corona negative - Telugu Bigg Boss 3, Bigg Boss Contestant Ravi Krishna Comments About Shiva Jyothi, Corona Negative, Dasara Event, Jatharo Jathara, Ravi Krishna, Ravikrishna, Shiva Jyothi, Shivajyothi, Star Maa Channel

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి మాట్లాడాల్సి వస్తే చాలామంది ప్రేక్షకులు పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే స్పందిస్తున్నారు.అయితే ఈ షొలో వివాదాల సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోపల సన్నిహితులై బయటకు వచ్చాకా కూడా కలిసి కనిపిస్తూ సందడి చేసే వాళ్లు చాలామంది ఉన్నారు.

TeluguStop.com - Bigg Boss Contestant Ravikrishna Comments About Shivajyothi

అలా ఎక్కువగా కనిపించే వాళ్ల జాబితాలో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు శివజ్యోతి, రవికృష్ణ ముందువరసలో ఉంటారు.
దసరా పండుగ సందర్భంగా స్టార్ మా ఛానెల్ లో జరిగిన జాతరో జాతర స్పెషల్ ఈవెంట్ కు రవికృష్ణ, శివజ్యోతి హాజరయ్యారు.

ఈ షోలో రవికృష్ణ మాట్లాడుతూ శివజ్యోతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిస్ బాస్ హౌస్ నుంచి రవికృష్ణ శివజ్యోతిని సొంత చెల్లిలా చూసుకుంటున్నారు.శివజ్యోతి సొంత యూట్యూబ్ ఛానల్ జ్యోతక్కలో కూడా రవి కొన్ని వీడియోలు చేశారు.జాతరో జాతర ఈవెంట్ లో మాట్లాడుతూ రవికృష్ణ తనకు శివజ్యోతి చెల్లి కాదని తల్లి అని చెప్పారు.

TeluguStop.com - శివజ్యోతి చిన్నపిల్లాడిలా చూసుకుందంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మూడు నెలల క్రితం తాను కరోనా బారిన పడ్డానని.ఆ సమయంలో శివజ్యోతి ఇంట్లో ఉన్నానని.అలాంటి సమయంలో ఆదుకున్నందుకు జ్యోతక్క, ఆమె భర్త కాళ్లు మొక్కినా తప్పు లేదని చెప్పారు.కరోనా సోకిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని ఆ సమయంలో తనకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి శివజ్యోతి జాగ్రత్తగా చూసుకుందని తెలిపారు.

తనను చిన్నపిల్లాడిలా చూసుకున్న శివజ్యోతి తను చెల్లి కాదు అమ్మ అని అన్నారు.
శివజ్యోతి, ఆమె భర్త సహాయం వల్ల తనకు కరోనా సోకినా చిన్నగానే అనిపించిందని తెలిపారు.

తాను రెంట్ కు ఒక హౌస్ లో ఉండేవాడినని అయితే కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ నిర్ధారణ అయిన తరువాత కూడా తనను ఇంట్లోకి రానివ్వలేదని రవికృష్ణ తెలిపారు.రవికృష్ణ చెబుతుంటే శివజ్యోతి భావోద్వేగానికి గురైంది.

#Shivajyothi #Ravi Krishna #Dasara Event #Corona Negative #Shiva Jyothi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Contestant Ravikrishna Comments About Shivajyothi Related Telugu News,Photos/Pics,Images..