అభిజిత్ కు ఝలక్.. విన్నర్ ఎవరో చెప్పేసిన రాహుల్..?

గత సీజన్లకు భిన్నంగా మొదట్లో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన బిగ్ బాస్ షో సీజన్ 4 రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో సఫలమవుతోంది.గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ అని ప్రచారం జరుగుతుండగా రోజురోజుకు అభిజిత్ పై నెగిటివిటీ పెరుగుతుండటం అతనికి మైనస్ గా మారుతోంది.

 Bigg Boss Contestant Rahul Siplgunj Want Sohel Or Ariyana Bigg Boss Winner, Ariy-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మొదట్లో అభిజిత్ కు మద్దతు ప్రకటించగా ప్రస్తుతం ఇతర కంటెస్టంట్లకు సపోర్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో పనికిరాని వాళ్లను బయటకు తోసేయాలంటూ రాహుల్ సంచలన పోస్ట్ పెట్టారు.

అరియానా, సొహైల్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విన్నర్ కావచ్చని పరోక్షంగా చెప్పారు.సొహైల్ , అరియానా టాప్ 2లో ఉంటే చూడాలని ఉందని వెల్లడించారు.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే జెన్యూన్ గా ఆడతారో వారికి మాత్రమే సపోర్ట్ చేయాలంటూ ప్రేక్షకులకు రాహుల్ సూచించారు.దీంతో ఈ సీజన్ విన్నర్ అభిజిత్ కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Airyana Glory, Rahul Sipligunj, Shock Abhjit, Sohel, Top-Movie

ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దని బాగా ఆడేవాళ్లకు సపోర్ట్ చేయాలని రాహుల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం రాహుల్ సిప్లిగంజ్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ సైతం బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ రాహుల్ కంటెస్టెంట్ల గురించి ఇలా చెప్పడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.అయితే రాహుల్ యూటర్న్ వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది.

మరోవైపు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో పలువురు సెలబ్రిటీలు, జబర్దస్త్ కమెడియన్లు, యూట్యూబర్లు వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరో చెబుతూ మద్దతు ఇవ్వాలని ఫ్యాన్స్ ను కోరుతున్నారు.గత సీజన్లలో ఊహించని కంటెస్టెంట్లు బిగ్ బాస్ విన్నర్ కావడంతో ఈ సీజన్ లో కూడా అలాగే జరగవచ్చని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube