బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉండాల్సింది.. నోయల్ సంచలన వ్యాఖ్యలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది.బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ షోపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 Bigg Boss Contestant Noel Sensational Comments About Bigg Boss Show, Abhijith, B-TeluguStop.com

ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోపై విమర్శలు చేయగా తాజాగా ఈ జాబితాలో సింగర్, నటుడు నోయల్ చేరారు.అనారోగ్య సమస్యల వల్ల బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నోయల్ బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉండాల్సింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనారోగ్య కారణాల వల్ల నోయల్ ఎలిమినేట్ కావడంతో నోయల్ మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు.అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల రీఎంట్రీపై ఆసక్తి చూపలేదు.

హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమయంలో అభిజిత్, హారిక, లాస్యలకు సపోర్ట్ చేస్తానని నోయల్ చెప్పారు.అయితే లాస్య ఇప్పటికే ఎలిమినేట్ కావడంతో నోయల్ అభిజిత్, హారికలకు సపోర్ట్ చేస్తున్నారు.

Telugu Abhijit, Bigg Boss Noel, Bigg Boss Show, Harika, Sensational-Movie

సిటీకి దూరంగా ఉన్న ఇంట్లో ఉంటున్న నోయల్ ను హారిక బ్రదర్ వంశీ, యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ వెళ్లి కలిసి ఇంటర్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో నోయల్ మాట్లాడుతూ బిగ్ బాస్ షో మనకు అవసరం లేని షో అని.ఆ షోకు ఎందుకు వెళ్లానో అని తనకు అనిస్తోందంటూ కామెంట్లు చేశారు.అభిజిత్, హారికలకే తన సపోర్ట్ ఉంటుందని వాళ్లే విన్ కావాలని కోరుకుంటున్నానని అయితే బిగ్ బాస్ షోను గత కొన్నిరోజులుగా చూడటం లేదని నోయల్ చెప్పారు.

మనుషులను ఎంత ఇష్టపడితే అంత దూరంగా ఉండాలని.దగ్గరగా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయని అందుకే తాను సిటీకి దూరంగా ఉంటున్నానని నోయల్ తెలిపారు.బిగ్ బాస్ షోలో హారిక విన్ కావాలని ఆడుతోందని.లవ్ ట్రాకులు, కామెడీ ట్రాకులు లేకుండానే బిగ్ బాస్ షోలో కష్టపడి ఆడుతోందని హారికను సపోర్ట్ చేస్తూ నోయల్ కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube