బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?  

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా ఈ వారం ఒక కంటెస్టెంట్, వచ్చే వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.

TeluguStop.com - Bigg Boss Contestant Mukku Avinash In Danger Zone

బిగ్ బాస్ షో చివరి వారానికి ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో ఉండనున్నారు.నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కు ఐదుగురు నామినేట్ కాగా హారిక అభిజిత్ లు ఒకరికొకరు, మోనాల్ అఖిల్ లు ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు.

అఖిల్, మోనాల్, సొహైల్ అవినాష్ ను నామినేట్ చేశారు.13వ వారం నామినేషన్స్ లో మోనాల్, అభిజిత్, హారిక, అఖిల్, అవినాష్ ఉన్నారు.అరియానా గ్లోరీ, సోహైల్ లు కొద్దీలో ఈ వారం నామినేట్ కాకుండా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు.అయితే గత వారం ఎవిక్షన్ పాస్ వల్ల సేవ్ అయిన అవినాష్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TeluguStop.com - బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించారు.

Telugu 13th Week Elimination, Bigg Boss Contestant, Danger Zone, Mukku Avinash-Latest News - Telugu

ప్రేక్షకుల్లో తన ఫాలోయింగ్ ను అంతకంతకూ అవినాష్ పెంచుకుంటూ వచ్చారు.మొదట్లో ఎలిమినేషన్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అవినాష్ ను ఎక్కువగా నామినేట్ చేయలేదు.అయితే రోజులు గడిచే కొద్దీ కొందరు కంటెస్టెంట్లు అవినాష్ ను సైతం నామినేట్ చేశారు.

నోయల్ ఎలిమినేట్ అయిన సమయంలో అవినాష్ పై చేసిన కామెంట్లు సైతం అతనికి మైనస్ అయ్యాయి.

జబర్దస్త్ షోలోకి మళ్లీ తీసుకోరంటూ చేసిన కామెంట్ల వల్ల మొదట్లో అవినాష్ సింపథీ గేమ్ ఆడుతున్నాడంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఆ తరువాత అవినాష్ తమ్ముళ్లు జబర్దస్త్ లోకి అవినాష్ ను మళ్లీ తీసుకుంటారని చెప్పడంతో ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరిగింది.ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

#BiggBoss #Mukku Avinash #Danger Zone #13thWeek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Contestant Mukku Avinash In Danger Zone Related Telugu News,Photos/Pics,Images..