ఇద్దరు పిల్లలకు తల్లైన మోనాల్.. అలాంటి పాత్రలో..?

సుడిగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆ తరువాత నటించిన సినిమాలు డిజాస్టర్లు కావడంతో ఇండస్ట్రీకి దూరమైంది మోనాల్ గజ్జర్.అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో ఛాన్స్ రావడం, ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ఫేమస్ కావడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోనాల్ కు పాపులారిటీ బాగా పెరిగింది.

 Bigg Boss Contestant  Monal Gajjar Playing Mother In Kagaz Movie, Pankaj Tripath-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో కొత్త సినిమా కథలను వింటున్నారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు మోనాల్ ఒక హిందీ సినిమాలో నటించగా ఆ సినిమా ఈ నెల 7వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.హౌస్ లో మోడ్రన్ డ్రెస్సులలో ఎక్కువగా కనిపించిన మోనాల్ సినిమాలో డీగ్లామర్ రోల్ లో కనిపిస్తున్నారు.

కాగజ్ పేరుతో ఈ సినిమా విడుదల కానుండగా మోనాల్ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తూ ఉండటం గమనార్హం.ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించిన మోనాల్ ఈ సినిమాలో మాత్రం డీగ్లామర్ రోల్ లో నటిస్తున్నారు.సల్మాన్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో బైల్ గాడీ పాట విడుదల కాగా మోనాల్ లుక్ ను చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.

హిందీలో ఈ సినిమా విడుదలవుతుండగా భవిష్యత్తులో ఈ సినిమా తెలుగులోకి డబ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పంకజ్ త్రిపాఠి, మోనాల్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కగా పంకజ్ భార్య పాత్రలో మోనాల్ నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube