ఆ కంటెస్టెంట్ వేస్ట్ అంటున్న కుమార్ సాయి..?  

bigg boss contestant kumar sai sensational comments about monal gajjar, big boss 4, elimination process, kumar sai comments about monal, kumar sai re entry - Telugu Bigg Boss 4, Elimination Process, Kumar Sai Comments About Monal, Kumar Sai Reentry

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేదనే సంగతి తెలిసిందే.అంచనాలకు అందని ఎలిమినేషన్లు, ఆసక్తి లేని టాస్కులు ప్రేక్షకులకు ఈ షోపై ఉత్సాహాన్ని తగ్గిస్తున్నాయి.

TeluguStop.com - Bigg Boss Contestant Kumar Sai Sensational Comments About Monal Gajjar

సీజన్ 4 పూర్తి కావడానికి ఇంకా నాలుగు వారాలే ఉన్నా వీకెండ్ ఎపిసోడ్లు మినహా వీక్ డేస్ ఎపిసోడ్లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన కుమార్ సాయి మళ్లీ బిగ్ బాస్ షోలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

TeluguStop.com - ఆ కంటెస్టెంట్ వేస్ట్ అంటున్న కుమార్ సాయి..-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా కుమార్ సాయి తన రీఎంట్రీ గురించి స్పందిస్తూ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కు బదులుగా తనను ఎలిమినేట్ చేశారని కుమార్ సాయి అన్నారు.

Telugu Bigg Boss 4, Elimination Process, Kumar Sai Comments About Monal, Kumar Sai Reentry-Latest News - Telugu

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కంటే తాను ఎంతో బెటర్ అని చెప్పారు.ప్రేక్షకులు తాను మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఎలిమినేట్ అయిన తరువాత వరుస అవకాశాలతో బిజీగా ఉన్నానని అన్నారు.హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పారు.చాలామంది బిగ్ బాస్ షోలో ప్లాన్ ప్రకారం ఉంటారని తనకు అలాంటివి ఏమీ ఉండవని చెప్పారు.

తాను బయట ఏ విధంగా ఉంటానో బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే విధంగా ఉంటానని తెలిపారు.తాను ఎలిమినేట్ అయిన సమయంలో మోనాల్ ఎలిమినేట్ అవుతానని ఫిక్స్ అయిందని.

ఓట్ల గురించి చెప్పలేను కానీ మోనాల్ కంటే తానే బెటర్ గా బిగ్ బాస్ హౌస్ లో ఆడానని ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు.బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ వేస్ట్ అని కుమార్ సాయి అన్నారు.

#Bigg Boss 4 #KumarSai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Contestant Kumar Sai Sensational Comments About Monal Gajjar Related Telugu News,Photos/Pics,Images..