పలు డ్యాన్స్ షోలకు హోస్ట్ గా వ్యవహరించడం ద్వారా, సినిమాల్లో నటించడం ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా కౌశల్ భారీస్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్2 విన్నర్ గా నిలవడానికి కౌశల్ ఎంతో శ్రమించారు.
ఈ షో ద్వారా కౌశల్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.పలువురు సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం కూడా కౌశల్ బిగ్ బాస్ షో విన్నర్ గా నిలవడానికి కారణమైంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షో తర్వాత ఎవరూ చేయని పనులను తాను చాలా చేశానని కౌశల్ అన్నారు.
చాలామంది బిగ్ బాస్ షో విన్ అయిన తర్వాత ఆటిట్యూడ్ ను పెంచుకుని తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారని కౌశల్ చెప్పుకొచ్చారు.నన్ను గెలిపించిన వాళ్ల కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్లను తాను కలిశానని కౌశల్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ చేయాలని తాను అనుకున్నానని అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని కౌశల్ చెప్పుకొచ్చారు.

కథ నచ్చకపోవడం వల్ల కొన్ని సినిమాలను వదులుకుంటే తాను ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం వల్ల మరికొన్ని సినిమాలలో తనకు ఆఫర్లు దక్కలేదని కౌశల్ చెప్పుకొచ్చారు.లైఫ్ లో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని కౌశల్ కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ షోకు తన రెమ్యునరేషన్ తక్కువేనని కౌశల్ వెల్లడించారు.నా అనుభవం అంత వయస్సు కూడా లేని దీప్తి సునైనా కౌశల్ రెండు వారాల్లో వెళ్లిపోతాడని చెప్పడంతో కౌశల్ అంటే ఏంటో చూపించాలని తాను అనుకున్నానని కౌశల్ పేర్కొన్నారు.గంటలోనే ఓటింగ్ మారిపోయి తాను రెండో వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ కాలేదని కౌశల్ చెప్పుకొచ్చారు.